దయతో చేసిన పని చిన్నదే అయినా లక్షలాది ముఖాలపై చిరునవ్వు తెప్పించగలదు

విలువ: ధర్మం
ఉపవిలువ: దయ

 

B04F85AB-34A6-4C24-B1C1-5473715D6D36

ఇద్దరు అబ్బాయిలు పొలంలో నుండి వెళ్తున్న ఒక రహదారిపై నడిచి వెడుతున్నారు. ఇద్దరిలో చిన్నవాడు, ఒక వ్యక్తి తన పొలంలో కష్టపడి పనిచేస్తుండడం చూసాడు. ఆ వ్యక్తి దుస్తులు పొలంగట్టు పక్కన అందంగా పేర్చబడి ఉన్నాయి. ఆ పిల్లవాడు తనకంటే పెద్దవాడైన తన స్నేహితునితో ” ఇతని బూట్లని మనం దాచిపెడదాము. పొలం నుండి బయటికి వచ్చినపుడు అతనికి బూట్లు కనబడవు కదా, అప్పుడు అతని ముఖంలో కనిపించే భారం అమూల్యమైనదిగా ఉంటుంది” అంటూ నవ్వాడు.

ఇద్దరిలోనూ పెద్దవాడైన పిల్లవాడు ఒక్క క్షణం ఆలోచించి ఇలా అన్నాడు.” అతను చాలా పేదవాడిలా కనిపిస్తున్నాడు. అతని దుస్తులు చూడు ఎలా ఉన్నాయో. మనం మరొక విధంగా చేద్దాము. బూట్లు రెండింటిలో ఒక్కొక్క వెండి నాణేన్ని పెట్టి ఈ పొదల వెనుక దాక్కుని చూద్దాము, ఆ వెండి నాణేలను చూసి అతను ఎలా స్పందిస్తాడో చూద్దాము”

ఈ పధకానికి చిన్నవాడు కూడా అంగీకరించాడు. ఒక్కొక్క బూటులోనూ ఒక వెండి నాణేన్ని ఉంచి వాళ్ళిద్దరూ పొద వెనుక దాగి చూస్తున్నారు.

కొద్దిసేపటి తరువాత పనిలో అలసిపోయిన ఆ రైతు బయటకు వచ్చాడు. బూట్లను చూసాడు. ఒక బూటును చేతిలోకి తీసుకోగానే అందులో వెండినాణెం ఉండడం గమనించాడు. ఆ నాణేన్ని పట్టుకుని ఎవరు పెట్టారా అని చుట్టుపక్కలంతా కలయచూసాడు. అతనికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. చేతిలో ఆ నాణేన్ని పెట్టుకుని నమ్మలేనట్లుగా దానివైపే చూస్తున్నాడు. అలా అయోమయ స్థితిలోనే రెండవ బూటును చేతిలోకి తీసుకోగానే అందులో రెండవనాణెం అతనికి కనిపించింది. అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

తాను ఒక్కడే అక్కడ ఉన్నానని భావించిన అతను మోకాళ్ళపై కూర్చుని పెద్దగా ప్రార్థన చెయ్యసాగాడు. అతను చేసే ప్రార్థన ఆ కుర్రవాళ్ళు దాక్కున్న ప్రదేశానికి స్పష్టంగా వినబడింది. ఆ పేదరైతు కృతజ్ఞతతో, బాధ నుండి విముక్తి పొందిన ఆనందంతో కళ్ళ వెంట నీళ్ళు కారుస్తూ ప్రార్థన చేసాడు. అనారోగ్యంతో ఉన్న తన భార్య గురించి, ఆకలితో ఉన్న తన కొడుకుల గురించి చెప్పడం వీళ్ళు విన్నారు. అజ్ఞాతవ్యక్తులు ఎవరో తనకు చేసిన ఈ సహాయానికి అతను తన హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసాడు.

కొద్దిసేపటి తరువాత ఈ కుర్రవాళ్ళు పొదలచాటు నుండి బయటకు వచ్చి తమ ఇంటి వైపుకి నడక కొనసాగించారు. ఆపదలో, అవసరంలో ఉన్న ఒక పేదరైతుకు సమయానికి సహాయం అందించి ఒక మంచిపని చేసినందుకు వాళ్ళకి మనసులో వాళ్లకి ఎంతో ఆనందం, తృప్తి కలిగాయి. ఆత్మానందంతో కూడిన చిరునవ్వు వారి ముఖాలపై వికసించింది.

నీతి: దయతో చేసే ఒక మంచిపని ఒక జీవితాన్నే మార్చవచ్చు. అటువంటి సహాయం అందించినవారికి,అందుకున్నవారికి కూడా ఆనందం కలుగుతుంది. ఇతరులకు మేలు చేసే మంచిపని చేయగల అవకాశం కోసం ఎప్పుడూ ఎదురుచూడండి.

https://saibalsanskaar.wordpress.com/2014/04/20/the-kind-neighbour/

http://www.facebook.com/neetikathalu

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s