ఇటుక

IMG_0033

విలువ: ధర్మ
ఉప విలువ : సహనం

ఒక రోజు ఒక ఉన్నత అధికారి వేగంగా తన కొత్త కార్ -”జాగ్వార్” లో పని మీద వెళ్తున్నాడు.దూరం నుండి దారిలో పిల్లలు ఆడుకోవటం గమనించాడు. పిల్లలు ఆడుకుంటున్న చోట దెగ్గరికి వచ్చేసరికి బ్రేక్ వేసి పిల్లలుకు దెబ్బల తగలకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంతలో హఠాత్తుగా ఒక ఇటుక రాయి ఎక్కడ నించో తన కార్ డోర్ మీద పడింది.

కార్ ని వెనుకకు తిప్పి ఇటుక రాయి పడేసిన ఆ కుర్రాడిని “ నువ్వు ఎవరు?ఎందుకలా చేశావురా “,అని కోపంగా మందలిస్తూ అడిగాడు. అంతే కాకుండా,”నా కార్ కొత్తదిరా,నీవు చేసిన పని వల్ల జరిగిన నష్టానికి నాకు చాలా డబ్బు ఖర్చు అవుతింది తెలుసా! నీవు ఎందుకలా చేశావు?”అని ఆ పిల్లవాడిని ఈ పెద్ద మనిషి నిలదీసి అడిగాడు.

దానికి జవాబుగా ఆ పిల్లవాడు”మాస్టారు!,దయ చేసి నా మాట వినండి,నన్ను తప్పుగా అర్ధం చేసుకోండి.ఎంత ప్రయత్నించినా ఎవరూ కార్ ను ఆపడం లేదు.. అందుకే నేను లా చేయవలసి వచ్చింది.”అదిగో అటు చూడండి సార్ ,మా తమ్ముడు వీల్ చైర్ నుండి కింద పడి పోయాడు?”వాడిని తిరిగి మళ్ళీ ఆ కుర్చీ లో కూర్చోపెట్టి ఇంటి వరకు తీసుకెళ్ళాలి,దయ చేసి నాకు సహాయం చేయగలరా,నేను ఒకడిని వాడిని ఎత్తి అందులో కూర్చో పెట్ట లేక పోయాను” అని ఏడుస్తూ  బ్రతిమాలాడు.

ఆ పిల్లవాడి పరిస్థితిని చూసి కార్ ఓనర్ చాలా జాలి పడ్డాడు,అతని కోపమంతా కరిగిపోయింది. వెంటనే తన చేతులతో క్రింద పడి ఉన్న ఆ పిల్ల వాడి తమ్ముడిని మళ్ళీ కుర్చీ లో కూర్చోపెట్టాడు. తన సొంత రుమాల్ (కర్చీఫ్ )ని తీసుకుని అతని ఒంటికి తగిలిన గాయాలను తుడిచి ,”నీకింకేమి కాదు,భయపడకు .”అని అన్నదమ్ములిద్దరికీ ధైర్యం చెప్పాడు.
ఎంతో దయతో సహాయం చేసిన అతనికి ఆ పిల్లవాడు కూడా,“ఆ భాగవతుడు మిమ్మల్ని  చల్లగా చూడాలి సార్” అని కృతజ్ఞతలను తెలుపుతూ వీల్ చైర్ లో కూర్చున్న తన తమ్ముడిని తోసుకుంటూ ఇంటి వైపు వెళ్ళిపోయాడు.

జోరుగా తగిలిన ఇటికరాయి దెబ్బకి కార్ డోర్ బానే సొట్ట బోయిందని తెలుసుకున్న ఓనర్ దాన్ని రిపేర్ చేయించకుండా  ఈ సంఘటనకి గుర్తుగా అలాగే  ఉంచేసాడు.

ఎందుకంటే దాని వల్ల ఆతను
“జీవితంలో మన చుట్టూ ఉన్న మనుషులని,పరిసరాలని పట్టించుకోకుండా మన సొంత పనులలో మునిగిపోతే,ఆపదలో ఉన్న వారిని గమనించలేము.అప్పుడు మన దృష్టిని వారి వైపు మరల్చటానికి ఎవరైనా ఇలంటి  సైగ చేసి మనని పిలిచే పరిస్థితి కలగకుండా మనము చూసుకోవాలి”అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.”

నీతి: భగవంతుడు మనతోనే ఉంటూ మన బాగు కోసం అంతర్వాణి రూపంలో ( inner voice) మనకి ఎప్పటికప్పుడూ సూచనలను,హెచ్చరికలను ఇస్తూనే ఉంటాడు. కానీ ,మన గోలలో మనం పడి వాటిని అశ్రద్ధ చేసినప్పుడు అనుభవాల ద్వారా మనము గుర్తించేలా చేస్తాడు.వాటిని వినటం, వినకపోవడం మన చేతుల్లోనే ఉంది. కనుక నిజ జీవితంలో అతి వేగాన్ని తగ్గించుకుని నిదానంగా , మానసిక అలజడి లేకుండా ఉండగలిగితే మన మంచి చెడులే కాకుండా మన చుట్టు పక్క వాళ్ళ బాగోగులని కూడా తెలుసుకుని వారికి సహాయపడే అవకాశాన్ని ఆ  భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s