సాధువుగా మారిన ఒక జాలరి

సాధువుగా మారిన ఒక జాలరి
విలువ -సత్ప్రవర్తన
ఉపవిలువ – పరివర్తనం

1f323d3

చీకటి బాగా కమ్మిన ఒక రాత్రి,జాలరి ఒకడు సరైన సమయం చూసుకుని ఒకరి ఉద్యానవనం లోకి
జొరపడ్డాడు.అందరూ నిద్రపోతున్నారని గమనించి అక్కడ ఉన్న చిన్న పాండ్ (కొలను)లో చేపలను
దొంగతనంగా పడదాము అని నిర్ణయించుకున్నాడు.

కాని,అతను చేపలను పట్టడానికి నీటిలో వల వేయగానే వచ్చిన చప్పుడుకి,ఆ ఇంటి యజమాని నిద్రకి భంగం కలిగింది.దాంతో ఆతను లేచేశాడు.ఖచ్చితంగా తన చేపలను దొంగిలించడానికి ఎవరో దొంగ దూరాడని గ్రహించాడు.

వెంటనే తన ఇంటిలో పని చేసే వారందరిని విషయమేమిటో కనుక్కోమని పంపించాడు. దాంతో ఆ జాలరికి,భయంతో ఎం చేయాలో తోచలేదు. “ఆమ్మో !వీళ్ళు నా వైపే వస్తున్నారు,ఇక్కడ గనక నన్ను చూస్తే తప్పకుండా చితకబాదుతారు,వారి నుంచి నన్ను నేను ఎలా రక్షించుకోవాలి “అని బాగా కంగారు పడ్డాడు. మందుగా తన చేతిలో ఉన్న వలని అక్కడ ఉన్న ఒక చెట్ల పొదలోకి విసిరేసాడు.కానీ,తాను దాక్కోవాటానికి సరైన చోటుని కనుక్కోలేకపోయాడు.

అప్పుడు అతనికి కొంత దూరంలో ఎవరో సాధువు వెలిగించైనా నిప్పు మంట కనిపించింది.
“అమ్మయ్య ,ఆ దేవుడి దయ వల్లో లేదా నా అదృష్టం వల్లనో నాకు వీళ్ల నుంచి తాప్పించుకునే మార్గమొకటి దొరికింది”అని ఎంతో సంతోషించాడు. తెలివిగా వెంటనే తన నెత్తికి ఉన్న తలపాగాను విసిరేసి అక్కడ ఉన్న బూడిదని కొంచం తన నుదుటి మీద రాసుకుని ఆ అగ్నిహోత్రం ముందు చక్కగా ఒక ముని వేషంలో ధ్యానం చేస్తున్నట్టు నటిస్తూ కూర్చున్నాడు.

అక్కడికి వచ్చిన ఆ ఇంటి యజమాని యొక్క దాసులు,ఇతనెవరో సాధువు,పాపం ఏదో ధ్యానం చేసుకుంటుంన్నట్టున్నారు,ఎందుకులే ఆయనకి ఇబ్బంది కలిగించటం అని వెళ్లిపోయారు.

యజమాని,వాళ్ళని ,”ఏ మైందిరా ఇంతకీ ఆ దొంగని పట్టుకున్నారా లేదా”అని ప్రశ్నించాడు.” దానికి జవాబుగా వాళ్ళు యజమానితో ,”లేదు దొరా ..దొంగని అయితే పట్టుకోలేకపోయాము కానీ ,మన వనం లో ఒక యోగి ని చూశాము”, అని చెప్పారు.

“అవునా,నిజమా! మన వనాన్ని ఒక ముని పుంగవులు పావనం చేశారా”ఎంత అదృష్టం అని ఎంతో ఆనంద పడిపోయాడు”నన్ను వెంటనే వారి దగ్గరకి తీసుకెళ్లండి అని వారిని అడిగారు.

ఆ యోగి దర్శనం చేసుకుని ,యజమాని నిశ్శబ్దంగా అక్కడి నించి వెళ్లిపోయాడు.”అమ్మయ్యా! మొత్తానికి చాలా తెలివిగా నేను సాధువుననే అని ఇంటి యజమానిని కూడా నమ్మించగలిగాను”అని జాలరి స్థిమిత పడ్డాడు. సరే ఎలాగో రాత్రి వేళ కదా ఇంకొంచం సేపు ఇక్కడే ఉండి తెల్లవారగానే ఇక్కడ నించి తప్పించుకుందాములే”అని అనుకుని అక్కడే ఆ రాత్రికి ఉండిపోయాడు ఆ జాలరి.

తీరా తెల్లవారగానే అక్కడి నుంచి బయలుదేరుతుంటే,అక్కడికి ఒక నడిమి వయస్సు కల దంపతులు చేతిలో ఒక చిన్న శిశువుని పట్టుకుని వచ్చి,
ఓ మహాశయా! ఇప్పుడే మీ రాక గురించి తెలుసుకున్నాను.దయచేసి మా బిడ్డని పది కాలాలు చల్లగా ఉండాలని దీవించండి” అని కోరారు.

ఏమి చేయాలో పాలుపోక.. వారిని నిరాశ పరచటం ఇష్టం లేక జాలరి వారి శిశువుని “సుఖీభవ!”అని ఆశీర్వదించి తప్పించుకుందామని బయలుదేరాడు. ఇంతలోకి ఆ వనానికి జనాలు గుంపులు గుంపులుగా తాను ఒక గొప్ప సన్యాసి అనుకుని,తన దర్శనం చేసుకుందామని చేరారు.

ఆ తరువాత ఆ జాలరి దొంగతనం చేయటం మానేశాడు.

 

నీతి:జీవితంలో జరిగే సంఘటనలు మరియు ఎదురయే అనుభవాలు మనలో ప్రవర్తనని తీసుకొస్తాయి.ముందుగా మనం మంచిగా మారాలి అని ప్రయత్నించాలి,అలా ప్రయత్నిస్తూ ఉంటే క్రమంగా మనలో మార్పు తప్పక వస్తుంది.
ఆంగ్లంలో “ఫేక్ ఇట్ టు మేక్ ఇట్”అని ఒక సూక్తి ఉంది .అంటే కథలోని జాలరిలా ముందు మాటవారసకైనా ఆదర్శవంతులలా జీవించటం అలవాటు చేసుకుంటే తప్పక ఒక రోజు అలాగే మారతాము.

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s