నిజానికి మారుపేరు — రాజా సత్య హరిశ్చంద్ర

 

నిజానికి మారుపేరు — రాజా సత్య హరిశ్చంద్ర

 

IMG_4978

విలువ — సత్యము
అంతర్గత విలువ — నిజాయితీ

రాజా హరిశ్చంద్ర, భార్య తారామతి, కొడుకు రోహితాశ్వ తో అయోధ్య నగరాన్ని పరిపాలించేవారు. నగరంలో ప్రజలు అందరూ సుఖ-సంతోషాలతో ఉండేవారు.

రాజా హరిశ్చంద్ర, చిన్నప్పటి నుంచి, అబద్ధము ఆడకూడదు, అన్న మాటకి కట్టుబడి నిజాయతీగా ఉండాలి అని నిర్ణయించుకున్నారు. రాజా హరిశ్చంద్ర, తన చిత్తశుద్ధి , నిజాయితీకి, పేరు ప్రఖ్యాతలు పొందారు. రాజా హరిశ్చంద్ర గురించి దేవతలు తెలుసుకుని, పరీక్ష పెట్టడానికి, ఋషి విశ్వామిత్రను ఎంపిక చేసారు.

ఋషి విశ్వామిత్ర చాలా సార్లు , రాజా హరిశ్చంద్ర చేత తప్పు చేయిద్దాము అని ప్రయత్నించారు, కానీ రాజుగారు తన నియమానికి కట్టుబడి ఉండడం వల్ల, ఏ తప్పు చెయ్యలేదు.

విశ్వామిత్ర ఋషి , తన మాయతో కొన్ని సందర్భాలను సృష్టించారు. దానితో రాజుగారు, తన రాజ్యాన్ని వదులుకోవాల్సి వచ్చింది. సంతోషంగా రాజ్యాన్ని విడిచి, కట్టు బట్టలతో, భార్యా, కొడుకుని తీసుకుని రాజ్యం నుండి బయటికి వచ్చేశారు.

విశ్వామిత్రుడు , రాజుగారి నిజాయితీకి ఆశ్చర్య పోయి, ఆఖరి ప్రయత్నంగా, రాజుగారిని దక్షిణ అడిగారు.

రాజుగారు, ఒక బ్రాహ్మణుడి మాట కాదు అనలేక , తన దగ్గర ఇవ్వడానికి ఏమి లేదని, ఒక నెల గడువు ఇస్తే, దక్షిణ ఇస్తాను అని ప్రాధేయ పడ్డారు.

రాజుగారు ఎంత ప్రయత్నించినా, పని దొరకలేదు. అన్ని ప్రయత్నాలు విఫలము అయ్యాయి. చివరికి కాశి (వారణాసి ) క్షేత్రము చేరారు.

కాశి నగరం ఒక పుణ్య క్షేత్రం. చాలా పాండిత్యము, భక్తి గల మనుషులతో నిండి ఉండేది. వృద్ధాప్యం లో ఉన్న వాళ్ళు కూడా కాశి క్షేత్రానికి వచ్చి ఉండేవారు. అంతటి క్షేత్రములో కూడా రాజుగారికి పని దొరకలేదు.

రాజుగారికి, విశ్వామిత్ర ఋషి ఇచ్చిన గడువు దగ్గర పడుతోంది. ఇంకా పని దొరకలేదు.
అప్పుడు రాజుగారి భార్య తారామతి ఈ విధంగా సలహా ఇచ్చారు.
“స్వామి నగరములో, గొప్పవాళ్ళ భవనంలో, ఇంటిలో నన్ను పనిమనిషిగా పంపండి . ఆ డబ్బుతో ఋషికి, దక్షిణ ఇవ్వచ్చు . పని దొరికాక నన్ను మళ్ళీ వెనుకకి తీసుకొచ్చెయ్యండి “.

రాజుగారికి ఎప్పుడూ తనకి తోడుగా ఉండే భార్యని ఇలా ఒకరింట్లో పనికి పెట్టాలంటే చాలా కష్టము వేసింది.

కానీ తప్పక, భార్యని, కొడుకుని , బజారులో నుంచోపెట్టి వేలం వేశారు. అప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు కొనుక్కోవడానికి సిద్ధ పడ్డారు. రాజుగారు వచ్చిన ధనమును, విశ్వామిత్రుడికి ఇవ్వగా, ఆయన “ఇదేనా ఇంతటి మహా జ్ఞానికి ఇచ్చే దక్షిణ అని ఆగ్రహించారు ”
రాజుగారికి ఏమి తోచలేదు. అదే సమయంలో త్రోవలో పోయే ఒక ఛండాలుడు, ‘స్మశానములో నాకు పనికి మనిషి కావాలి ” అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుల వారు , ‘ఆ పనిలో చేరి, నా దక్షిణ ఇవ్వు ” అని రాజుగారితో అన్నారు.
రాజుగారు తప్పని పరిస్థితిలో చండాలుడి దగ్గర పనికి చేరి, ఋషికి దక్షిణ ఇచ్చారు.
భార్యా, కొడుకు ఏ పరిస్థితి లో ఉన్నారో అని రోజూ అనుకునే వారు రాజుగారు.

ఒక రోజు ఉద్యాన వనంలో పువ్వులు కొయ్యడానికి తన కొడుకు వెళ్ళాడు. అక్కడ పాము కరిచి వెంటనే అతడు మరణించాడు. మహారాణి అయిన తారామతి అతి దుఃఖముతో కొడుకుని తీసుకుని స్మశానానికి వచ్చారు.
స్మశానములో ఉన్న రాజుగారు, భార్యని, మరణించిన కొడుకుని గుర్తుపట్టలేదు. శవాన్ని దహనము చెయ్యడానికి డబ్బులు అడిగారు. అప్పుడు తారామతి ‘నేను ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పని చేస్తున్నాను, ఇవ్వడానికి నా దెగ్గర ఏమి లేదు. ఉన్న కొడుకుని కూడా పోగొట్టు కున్నాను ” అని అన్నారు. రాజుగారు ఆమె అన్న మాటలికి చాలా బాధ పడ్డారు. అప్పుడు ఆమె మెడలో ఉన్న మంగళసూత్రము చూసి “డబ్బుకి బదులిగా మంగళసూత్రము ” ఇవ్వమని అడిగారు.

తారామతి అప్పుడు రాజుగారిని గుర్తుపట్టి “స్వామి నేను మీ భార్యని , పడుకున్నది మన యువరాజు ” అని చెప్పగానే రాజుగారు చాలా బాధ పడ్డారు.
దహనము చెయ్యడానికి డబ్బు తీసుకోవడం తన ధర్మమని అన్నారు. అప్పుడు తారామతి తన ఒంటిమీద ఉన్న వస్త్రము తప్ప తన దెగ్గర ఇంక ఏమి లెదు అని, మంగళసూత్రము తియ్యబోయారు.

అప్పుడు ఆకాశం నుంచి దేవతలు, విశ్వామిత్ర ఋషి దిగి వచ్చారు.

ఈ కష్టాలన్నీ దేవతలు సృష్టించారు అని చెప్పారు. ఛండాలుడు వేషంలో ఉన్న యముడు ) , బ్రాహ్మణుడి వేషంలో ఉన్న ఇంద్రుడు కలిసి నడుచుకుంటూ వచ్చారు. మరణించిన కొడుకు, కళ్ళు నలుపు కుంటూ లేచి వచ్చాడు.

సంతోషంతో విశ్వామిత్ర ఋషి, దేవతలు హరిశ్చంద్రుని నిజాయితీకి మారుపేరు అని ప్రకటించారు.

నీతి:
హరిశ్చంద్ర అనే పేరు నీతీ, నిజాయితీలకి ప్రతీక.ఆయన జీవిత చరిత్ర చాలా మందికి స్ఫూర్తిని ఇస్తుంది.

నిజాయితీ ఎంతో గొప్ప గుణము. ఎవరైతే నిజాయితీగా జీవిస్తారో , వాళ్ళు ఎటువంటి కష్టము నుండైనా ,విజయవంతంగా బయట పడగలుగుతారు.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s