నిజాయితీ

విలువ:సత్యము, సత్ప్రవర్తన

అంతర్గత విలువ:నిజాయితీ

 

IMG_4511
ఒక ఊరిలో ఒక దొంగ ఉండేవాడు. ఒకరోజు అతడు దొంగతనమునకు బయలుదేరి దొంగిలించడాని కి విలువైన వస్తువులు ఏమీ కనపడక పోవడం తో అన్ని చోట్లా వెతుకుతూ ఒక గుడి వద్దకు చేరుకున్నాడు.అక్కడ ఒక పూజారి మతము మరియు ఆధ్యాత్మిక సంబంధ మైన విషయాల మీద ఉపన్యాసం ఇస్తున్నాడు. ఆయన సత్యము పలకడం,నిజాయతీ అనే విషయములను గురించి మాటలాడుతున్నాడు.ఆ ఉపన్యాసాన్ని అనేకమంది ధనవంతులు, గొప్పవారు, సామాన్యులు అన్నిరకాల జనం ఆసక్తి గా వింటున్నారు. అక్కడ ఉన్న ధనవంతుల వద్ద ఉన్న విలువైన వస్తువులు దొ౦గిలించాలని దొంగ భావించాడు. కాని పూజారి సమక్షంలో దొంగతనం చేయడం తనకు అంత క్షేమం కాదని తాత్కాలికంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.పూజారి ఉపన్యాసం మరీ అంత చెడ్డ గా లేదు అని దొంగ అనుకున్నాడు. చివరి దాకా ఉపన్యాసం విన్నాడు. ఉపన్యాసం అయిపోయాక అందరూ వెళ్లి పోయారు దొంగ ఒక్కడే అక్కడ ఉండి పోయాడు తన లాంటిదొంగకు నిజ౦ చెబుతూ జీవించడం ఎలా సాధ్యం అని అనుకున్నాడు.
తాను అక్కడ ఉండడం పూజారికి అనుమానం కలిగిస్తుందని దొంగ భావించాడు.పూజారికి భయం కలగ కుండా ఉండాలనే ఉద్దేశ్యంతో దొంగ పూజారి వద్దకు వెళ్లి నేను ఇక్కడ ఏమీ అనుచితమైన పని చేయాలని భావించడం లేదు మీరేమీ సందేహ పడకండి. మీరు నిజాయితీ గురించి చాలా  గంభీరం గా ఉపన్యసించారు మీ ఉపన్యాసం నాకు చాలా నచ్చింది కాని నా మనస్సు మీ మాటలను జీర్ణించు కో లేక పోతోంది నా లాంటి దొంగ కు అబద్ధం కూడా ఆడ కుండా ఉండడం ఎలా సాధ్య మవుతుంది అని చెప్పి పూజారిని దొంగ చాలా ప్రశ్నలు వేశాడు చాలా సేపు వాదించాడు. పూజారి దొంగ ప్రశ్నలన్నిటికకీ  చాలా ఓపిక గా సమాధానాలు చెప్పాడు. అబద్ధమాడకుండా నిజాయితీ కి కట్టుబడి ఉండి నీవు నీ వృత్తి ని కొనసాగించ వచ్చ్చునని పూజారి దొంగకు సలహా ఇచ్చాడు. ఆ క్షణం నుంచి అబద్ధమాడ కూడదని నిజాయితీ కి కట్టు బడి ఉండాలని దొంగ నిర్ణయించు కున్నాడు.
ఒకరోజు రాత్రి దొంగ అలవాటు గా దొంగ తనానికి బయలు దేరాడు అదే సమయం లో ప్రజల మంచి చెడ్డలను స్వయంగా తెలుసుకోవాలని ఆదేశాన్ని పరిపాలించే రాజుగారు మారు వేషంలో బయలు దేరాడు. రాజు దొంగ ఇద్దరూ ఒక చోట కలుసుకున్నారు.రాజు దొంగ ను చూసి,”నువ్వెవరు,అని అడిగాడు.”దొంగ నిజాయితీ గా నేను దొంగను అని చెప్పాడు రాజు నేను కూడా దొంగ నే అన్నాడు దొంగ చాలా  ఆశ్చర్య పోయాడు.ఇద్దరూ మంచి మిత్రులయి పోయారు ఒకళ్ళ నొకళ్ళు ఆప్యాయతతో కౌగిలిం చుకున్నారు రాజు దొంగ తో కొన్ని విలువైన వస్తువులు ఉన్న ప్రదేశం నాకు తెలుసు.అక్కడకు వెళ్లి వాటిని దొంగిలిద్దామని చెప్పాడు. దొంగ అంగీకరించాడు.రాజు దొంగను రాజ భవనానికి తీసుకు వెళ్ళాడు,ధనాగారం దగ్గరకు తీసుకు వెళ్లి ఖజానా పగుల గొట్టమన్న్నాడు దొంగ ఖజానా పగుల గొట్టాడు దాంట్లో అయిదు విలువైన వజ్రాలు ఉన్నాయి.ఈ వజ్రాలలో మనం నాలుగు మాత్రమే తీసుకుని ఇద్దరం చెరో రెండు పంచుకుందాము. మిగిలిన వజ్రాన్ని ముక్కలు చేస్తే దానికి విలువ లేకుండా పోతుంది అనిదొంగ రాజుతో చెప్పాడు దానికి రాజు అంగీకరించాడు ఆ ప్రకార్రం ఇద్దరూ రెండేసి వజ్రాలు తీసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్లి పోయారు.
మరుసటి రోజున రాజు ఉద్యోగులు వచ్చి చూసే సరికి ఖజానా పగుల గొట్ట బడి ఉంది.విషయం రాజు గారికి తెలిసింది. దొంగను వెతికి  బంధించి తీసుకు రమ్మని రాజు భటులను  ఆజ్ఞాపించాడు.భటులు అంతటా వెతికి  దొంగను బంధించి తెచ్చి రాజు ముందు నిలబెట్టారు. రాజు దొంగను కాలి గోటి నుంచి తల వెంట్రుక  దాకా పరిశీలించి నువ్వేనా దొంగ తనం చేసింది అని అడిగాడు. నేను నా మిత్రుడు కలిసి నాలుగు వజ్రాలు దొంగిలించి ఇద్దరూ చెరొక రెండు వజ్రాలు పంచుకున్నాము అని దొంగ నిజాయితీ గా సమాధానము చేప్పాడు.రాజు ధనాగారం అధికారి ని పిలిచి ఎన్ని వజ్రాలు పోయాయి అని అడిగారు. మొత్తం అయిదు వజ్రాలు పోయాయి అని చెప్పాడు. ఏమి జరిగిందో రాజు గారికి అర్ధం అయింది. రాజు వెంటనే ధనాగారం అధికారిని ఆ ఉద్యోగం నుంచి తొలగి౦చి ఆ స్థానం లో దొంగను నియమించాడు.ఈ విధంగా సత్యం పలకడం అనే విషయానికి కట్టుబడి ఉండి దానికి తగిన బహుమానాన్ని పొంద గలిగాడు ఆ దొంగ.చెడ్డ అలవాట్లు విడిచి పెట్టి మంచి అలవాట్లను అనుసరించ గలిగితే ప్రతి వారు గొప్పవారు కాగలుగుతారు.
నీతి:మంచి అలవాట్లు జీవితం లో మహోన్నత స్థానాననికి చేరడానికి సోపానాలు!

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s