విశ్వాసమే బలము !!

విలువ: విశ్వాసం

అంతర్గత విలువ: నమ్మకం

IMG_4074

కొత్తగా పెళ్ళయిన దంపతులు ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఆ నదిలో ఉన్నట్టుండి పెద్ద తుఫాను మొదలయింది. భర్త ధైర్యంగా కూర్చుని చూస్తున్నాడు. భార్య మాత్రం చాలా భయపడసాగింది. ఒక వైపు నదిలో అలలు, మరోవైపు తుఫాను వల్ల వాళ్ళు ప్రయాణిస్తున్న చిన్న పడవ అటూ ఇటూ ఊగిపోసాగింది. ఏ క్షణంలో పడవ మునిగిపోతుందో అని భార్య భయపడుతోంది. భర్త మాత్రం అసలు ఏమీ జరగనట్లుగా, మౌనంగా, ధైర్యంగా కూర్చున్నాడు.

భార్య వణుకుతున్న గొంతుతో , భర్త తో ఈ విధంగా అంది” మీకు భయం వెయ్యట్లేదా? అంత ధైర్యం గా ఎలా ఉండగలుగుతున్నారు? నాకయితే ఇవాళే మన జీవితంలో ఆఖరి రోజు అనిపిస్తోంది. ఈ తుఫానులో మనం క్షేమంగా ఒడ్డుకి చేరుకోవడం కష్టం. ఏదయినా అద్భుతం జరిగితేనే మనం ప్రాణాలతో బయటపడగలం. లేదంటే మనకి చావు తప్పదు. మీకు పిచ్చి గాని పట్టిందా? అసలు ఇంత ధైర్యంగా ఎలా ఉన్నారు.”

భర్త నవ్వుతూ తన దగ్గర ఉన్న కత్తిని తీసాడు. అతని ప్రవర్తనకి ఆశ్చర్యపోయిన భార్య అయోమయంతో అతని కేసి చూస్తోంది. భర్త కత్తిని భార్య మెడకి దగ్గరగా పెట్టి ” ఇప్పుడు నీకు భయం వేస్తోందా?” అని అడిగాడు. భార్య నవ్వుతూ నాకెందుకు భయం? మీ చేతిలో కత్తి ఉంటే నేను భయపడాలా? మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నన్ను ఏమీ చెయ్యలేరు అంది.

భర్త కత్తిని వెనక్కి తీసుకుని , “ఇదే నా సమాధానం కూడా. భగవంతుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ తుఫాను సృష్టించింది ఆయనే కాబట్టి, ఆయనే మనల్ని రక్షిస్తాడని నా నమ్మకం” అన్నాడు.

అందువల్లనే మన పెద్దలు ఏది జరిగినా మన మంచికే అని చెప్తూ ఉంటారు. మన జీవితాల్లో ఏమి జరిగినా భగవంతుని నిర్ణయం ప్రకారం జరుగుతాయి కాబట్టి భగవంతుని పట్ల విశ్వాసం కలిగిఉండాలి.

నీతి

మనం భగవంతుని పట్ల విశ్వాసం పెంచుకోవాలి. ఆ విశ్వాసమే మన బలంగా మారి మనల్ని ముందుకి నడిపిస్తుంది.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s