మామిడి చెట్టు

మామిడి చెట్టు
విలువ : ప్రేమ
అంతర్గత విలువ : కృతజ్ఞత, బాధ్యత

 

IMG_3886

 

పూర్వకాలంలో ఒక మామిడి చెట్టు ఉండేది. ఒక చిన్న అబ్బాయి రోజూ ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆడుకునేవాడు. ఆ మామిడిచెట్టు కొమ్మలపైకి ఎక్కి కూర్చునేవాడు, ఆ చెట్టు పళ్ళు తినేవాడు, ఆడుకుని అలసిపోతే ఆ చెట్టు నీడలో నిద్రపోయేవాడు.
కాలం గడిచింది. ఆ ఆబ్బాయి కొంచెం పెద్దవాడయ్యాడు. రోజూ చెట్టు దగ్గరకు వచ్చి ఆడుకోవడం మానేసాడు.
ఒకరోజు విచారంగా వచ్చి చెట్టు దగ్గర నిలబడ్డాడు. మామిడి చెట్టు ఎంతో సంతోషంగా వచ్చావా,”నా మీద ఎక్కి ఆడుకో అంది.!”
ఆ అబ్బాయి ,”నేనేమీ చిన్న పిల్లవాడిని కాదు, నీతో ఆడుకోవడానికి నాకు బొమ్మలు కావాలి, కానీ అవి కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు లేవు “అన్నాడు. అప్పుడు మామిడిచెట్టు ,”నా దగ్గర డబ్బు లేదు కానీ నా మామిడి పళ్లన్నీ కోసి అమ్మి నువ్వు డబ్బు సంపాదించుకోవచ్చు” అని చెప్పింది. ఆ అబ్బాయి చాలా సంతోషంగా మామిడి పళ్ళు అన్నీ కోసుకుని వెళ్ళిపోయాడు. మరలా కొంతకాలం వరకూ తిరిగిరాలేదు. మామిడి చెట్టు ఆ అబ్బాయి గురించి విచారంగా ఎదురుచూడసాగింది. కొంతకాలానికి ఆ అబ్బాయి పెరిగి పెద్దవాడయ్యాడు. తిరిగి మామిడి చెట్టు దగ్గరికి వచ్చాడు.అతనిని చూసి మామిడిచెట్టు చాలా సంతోషించింది. “నీతో ఆడుకోవడానికి నాకు సమయం లేదు,నా కుటుంబం కోసం ఇల్లు కట్టుకోవాలి. నువ్వు నాకు ఏమైనా సహాయం చెయ్యగలవా? “అని అడిగాడు.

 

మళ్ళీ మామిడిచెట్టు ,”నా దగ్గర డబ్బు లేదు కానీ నా చెట్ట్టు కొమ్మలు విరిచి నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పింది.” అతను కొమ్మలన్నీ విరిచి ఇల్లు కట్టుకుని కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. అతను సంతోషంగా ఉండడం చూసి మామిడి చెట్టు కూడా సంతోషించింది. మళ్ళీ అతని కోసం విచారంగా ఎదురుచూడసాగింది. కొంతకాలం తరువాత అతను మళ్ళీ వచ్చాడు.

“నాతో ఆడుకోవడానికి వచ్చావా? అని ఆశగా అడిగింది చెట్టు.”
దానికి అతను ,”నేను ముసలివాడనయ్యాను. ప్రశాంతత కోసం కొంతకాలం పడవలో ప్రయాణం చెయ్యాలి అనుకుంటున్నాను. నువ్వు నాకు పడవ కొనివ్వగలవా?” అని అడిగాడు. దానికి మామిడి చెట్టు ,”నా దగ్గర డబ్బు లేదు కానీ నా చెట్టు మొదలు నరికి దానితో నువ్వు పడవ చేసుకోవచ్చు “అన్ని చెప్పింది.

అతను చెట్టు మొదలు నరికి పడవ చేసుకుని వెళ్ళిపోయాడు. చాలా సంవత్సరాల తరువాత తిరిగి మామిడి చెట్టు దగ్గరికి వచ్చాడు.

అతనిని చూసి నీకు ఇవ్వడానికి ,”నా దగ్గర ఏమి లేదు, కనీసం మామిడిపళ్ళు కూడా లేవు అంది. ”

“నువ్వు ఇచ్చినా కొరుక్కుని తినడానికి నా నోట్లో పళ్ళు లేవు అన్నాడు. ”

“నువ్వు ఎక్కి ఆడుకోవడానికి నా చెట్టు మొదలు కూడా లేదు “అంది చెట్టు.

“ఎక్కి కూర్చునే ఓపిక కూడాలేదు నాకు “అన్నాడు అతను.

“నా చెట్టు వేళ్ళు తప్ప ఏమి ఇవ్వలేను అంది బాధగా.”

“ఇన్ని సంవత్సరాల జీవితంలో నేను విసిగిపోయాను. నాకు విశ్రాంతి తీసుకోవడానికి కొంచెం స్థలం చాలు “అన్నాడు.

“అలా అయితే నా పక్కన వచ్చి కూర్చో అంది చెట్టు. ”

అతను చిరునవ్వుతో ఆ చెట్టు పక్కన కూర్చున్నాడు.
నీతి :
పై కథలో చెట్టు మన తల్లిదండ్రులను గుర్తుకు తెస్తుంది. మనం చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళతో ఆడుకోవడానికి సరదా పడతాము.కానీ పెద్దయిన తరువాత అవసరం వస్తేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాము. తల్లిదండ్రులు పిల్లలకోసం జీవితాంతం కష్టపడతారు. వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండి అవసరంలో వాళ్ళకి సహాయపడడం మన ధర్మం. ముసలి వాళ్ళయిన తల్లిదండ్రులతో ప్రేమగా కొంత సమయం గడుపుతూ వాళ్ళని సంతోషంగా ఉంచాలి.

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s