నమ్మకము

ఒక మహాత్ముని నమ్మకము
విలువ; ధర్మం
అంతర్గత విలువ ; అంకితభావం

 

IMG_2330

పూర్వకాలంలో ఒక ముని ఉండేవాడు. అతను భగవంతుని దర్శనం కోసం తపస్సు చేస్తున్నాడు. అడవిలో చెట్ల క్రింద నివసిస్తూ, ఆ చెట్ల ఆకులనే తింటూ ఉండేవాడు. ఒక రోజు నారద మహర్షి అటువైపుగా వెళ్తూ ఈ మునిని చూసి ఆగేడు.

ముని కూడా నారద మహర్షిని చూసి నమస్కరించి, మీరు భగవంతుని దగ్గరకు వెళ్తూ ఉంటారు కదా, నాకు ఒకసహాయం చెయ్యగలరా? అని అడిగాడు. దానికి నారద మహర్షి చేస్తాను అన్నాడు. అప్పడు ముని ” నేను ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాను.నాకు మోక్షం ఎప్పుడు లభిస్తుందో అడిగి చెప్పండి” అన్నాడు.
నారద మహర్షి సరేనని భగవంతుని దగ్గరకు వెళ్ళాడు. నారదుణ్ణి చూసి భగవంతుడు ” భూలోకంలో విశేషాలు ఏమిటి?” అని అడిగాడు.
విశేషాలు చెప్తూ ఈ ముని మోక్షం గురించి కూడా అడిగాడు. దానికి భగవంతుడు అతను తపస్సు చేస్తున్న చోట చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మల తరువాత మోక్షం ఇస్తాను అని చెప్పాడు.
అది విన్న నారదుడు చాలా బాధపడ్డాడు. అయ్యో ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న అతనికి విషయం చెప్తే ఎంత నిరాశ పడతాడో కదా అనుకున్నాడు.
తిరిగి ముని దగ్గరకు వచ్చాడు. అతనిని చూసిన ముని సంతోషంతో భగవంతుడు ఏమి చెప్పాడు ? అని అడిగాడు.
నీవు కూర్చున్న చెట్టుకి ఎన్ని ఆకులున్నాయో అన్ని జన్మల తరువాత మోక్షం వస్తుంది అని చెప్పాడు. అది విన్న ముని ఆనందంతో గెంతులు వెయ్యసాగాడు.
నారద మహర్షి ఆశ్చర్యంతో దీనిలో సంతోషం కలిగించే విషయం ఏముంది? అని అడిగాడు. అప్పుడు ముని, భగవంతుడు నాకు మోక్షం ఇస్తానని  మాట ఇచ్చారు  కదా అందుకు సంతోషిస్తున్నాను అన్నాడు. ఆ మాట చాలు నాకు అన్నాడు.
వెంటనే భగవంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అది చూసి నారదుడు మరింత ఆశ్చర్యంతో స్వామీ; ఇప్పుడే వచ్చారేమిటి? చాలా జన్మల తరువాత కదా ఇతనికి మోక్షం ఇస్తానని చెప్పేరు ? అని అడిగాడు.
అన్ని జన్మలు తరువాత ఇస్తానన్నా కూడా ఈ ముని అసలు నిరాశ పడలేదు. ఇతనికి నా మాట పై ఉన్న  నమ్మకము ,భక్తి చూసి ఇప్పుడే మోక్షం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అన్నాడు భగవంతుడు.

నీతి; నారద మహర్షి చెప్పిన సమాధానం విని ముని ధైర్యం కోల్పోయి ఉంటే భగవంతుని దర్శనం లభించేది కాదు. అంకిత భావంతో పని చేస్తే మన గమ్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుని, సక్రమమైన పద్దతిలో నమ్మకంతో శక్తివంచన లేకుండా కృషి చేసి దానిని సాధించాలి.

http://saibalsanskaar.wordpress.comm

http://www.facebook.com/neetikathalu

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s