పిల్లలను ప్రేమించండి కానీ అతి గారాబం చేయకండి

MonarchEmergeSeries_butterflyపిల్లలను ప్రేమించండి కానీ అతి గారాబం చేయకండి.
…హిందూ ధర్మచక్రం.

  శూరసేనుడనే మహారాజు చాలా గొప్పవాడు. అతడు తన రాజ్యంలోని ప్రజలందరినీ కన్నబిడ్డలా చూసుకునేవాడు. ఇతని పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. ప్రజలు ఎవరి వృత్తులను వారు సక్రమంగా చేసుకునేవారు.. అలా పరిపాలిస్తున్న మహారాజుకు ఓక కోరిక కలిగింది. గొంగళి పురుగువ సీతాకోకచిలుక ఎలా అవుతుందో చూడాలి అనుకున్నాడు. తన ఉద్యానవనంలో కొన్ని చెట్లకి గొంగళి పురుగులు ఉండడం చూసి పంట పండింది అనుకోని రోజు వచ్చి చూస్తూ ఉండేవాడు అవి ఒక రొజు వచ్చి చూస్తే గూడు కట్టుకుని వాటిలో మరలా ఉండేవి మరునాడు వచ్చి చూసేసరికి సీతాకోకచిలుకలై ఎగిరిపోతూ ఉండేవి. ఇలా చాలారోజులు ప్రయత్నించాడు. కాని ఎప్పుడు సీతాకోక చిలుక పుట్టుకను మాత్రం చూడలేకపోయేవాడు.

ఒకనాడు మంత్రిగారిని పిలిచి తన మనస్సులో కోరికను వెల్లడించాడు. మంత్రి విని వెంటనే ఆ గొంగళి పురుగులు ఉన్న చెట్టు దగ్గర భటులను నియమించి ”సీతాకోకచిలుక పుట్టే సమయాన్ని మాకు తెలియజేయండి.. అని ఆదేశించాడు. భటులు అలాగే అని,గొంగళిపురుగులు ఉన్న చెట్టు దగ్గర కాపలా కాచి సీతాకోకచిలుక పుట్టే సమయాన్ని మంత్రిగారికి తెలియజేయగా, ఆయన హుటాహుటిన రాజుగారిని వెంటబెట్టుకొని ఉద్యానవనానికి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి గూడులో నుండి సీతాకోక చిలుక బయటికి రావడం మొదలైంది.

రాజుగారు ఎంతో ఆసక్తిగా చూడడం మొదలుపెట్టాడు. గూడులో నుండి  సీతాకోక చిలుకను మెల్లమెల్లగా బయటికి రావడం  చూసి, మహారాజు య్యో! ఎంత చిలుక కష్టపడుతుందో! పాపం అనుకుని దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న చాకుతో చిన్నగా, సీతకోకచిలుకకి ఏమీ కాకుండా ఆ గూడుని చిందర వందర చేశాడు.అప్పుడు 

చిలుక బయటికి వచ్చి క్రింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంది. అది చూసి అయ్యయ్యో ఇది ఎగరలేకపోతుంది అని తన చేతుల్లోకి తీసుకొని పైకి ఎగరేశాడు. అయినా అది ఎగరలేక క్రిందపడిపోయి ఎగరడానికి ప్రయత్నిస్తూనే ఉంది . కాని,రెక్కలు విచ్చుకోకపోవడంతో  గిల గిలా తన్నుకొని తన్నుకొని చనిపోయింది. అది చూసిన మహారాజు దుఃఖించాడు.

మంత్రివర్యా! ఏమిటి ఇలా జరిగింది. ఎందుకలా ఈ చిలుక చనిపోయింది? అని అడిగాడు. అప్పుడు మంత్రిగారు ఇలా అన్నారు.

మహరాజా! సృష్టిలో ప్రతీదీ తనకుతానుగా ఎదగడానికి ప్రయత్నించాలి. అప్పుడే తన సామర్ధ్యం ఏమిటో తెలుస్తుంది. ఒక విద్యార్థి విద్య నేర్చుకునేటప్పుడు బాధ్యత గల గురువు అతనిని శిక్షించవచ్చు!అలాగని గురువుకి శిష్యుడి మీద కోపం ఉందని  అనుకోకూడదు. తనను మంచి మార్గంలో పెడుతున్నాడు అని అర్ధం చేసుకోవాలి .శిక్షించకపోతేనే ప్రమాదం. విచ్చలవిడితనం పెరుగుతుంది. సర్వనాశనం అవుతాడు. అలాగే ప్రకృతికి నియమములకి కట్టుబడి జీవులు బ్రతకాలి. మీరు ఏదో ఆ చిలుకకి అది కష్టపడకూడదు అన్న ఉద్దేశ్యంతో సహాయం చేద్దాం అనుకున్నారు. చివరికి పాపం అది చనిపోయింది. ఇదిగో దీన్ని చూడండి అని మరొక సీతాకోకచిలుక బయటికి రావడం చూపించాడు. రాజు గారు మళ్ళీ దానిని బయటికి తీయడానికి వెళ్లబోతుంటే మంత్రి ఆపి, మహారాజా! ఎం జరుగుతుందో చూడండి అని ఆయనను మర్యాదగా ఆపాడు.

సీతాకోకచిలుక తన చుట్టూ ఉన్న వలయాన్ని చీల్చుకువచ్చి రివ్వున ఆకాశానికి ఎగిరింది. అప్పుడు ఆ మంత్రి వినయపూరకంగా మహారాజా! చూశారా!  సహజంగా తనకు తానుగా పోరాడి బయటికి రావడం వలన చిలుక ఇంద్రియాలలో బలం పెరిగింది. దానివలన అది చక్కగా ఎగరకలిగింది. ఇందాక మీరు అది ఎక్కడ కష్టపడుతుందో అని, వలయాన్ని చీల్చేసారు. దానివలన సీతకోకచిలుకకి తన  రెక్కలలో బలం చాలక ఎగరలేక చనిపోయింది. అర్థమైందా మహారాజా! ప్రతిజీవికి పరమాత్మ స్వయం శక్తిని ఇచ్చాడు. దానిని ఎవరికివారు  తెలుసుకునే అవకాశాన్ని ఇవ్వాలి.అలాకాకుండా ఎక్కడ కష్టపడతారో అని ఆ జీవి కష్టం కూడా మనమే పడితే ఇదిగో అనవసరంగా వారి వికశానికి మనమే అడ్డుపడిన వారము అవుతాము”, అని మంత్రి తెలుపగా ,రాజుగారు మంత్రిగారికి కృతజ్ఞతలు తెలియజేసి సన్మానించి బహుమతులను కూడా ఇచ్చాడు. 

ParentAndChild

నీతి :
ఈ కథ ఇప్పటి తల్లిదండ్రులకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది.
ఇలా పిల్లలపై ప్రేమ పిల్లల నాశనానికే తప్ప వికాసానికి దారితీయదు అని నా అభిప్రాయం.
….✍ హిందూ ధర్మచక్రం.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s