వృద్ధ దంపతులు వారి మానవత్వం!

image

వృద్ధ దంపతులు వారి మానవత్వం

విలువ :సత్యము

అంతర్గత విలువ :నిజాయితీ మరియు తృప్తి!!!

కొన్నాళ్ళ క్రిందట నేను ఒక రోజు రాత్రి తమిళనాడు లోని తంజావూరు జిల్లా  లో ప్రయాణం చేస్తున్నాను.  చాలా చీకటి గా ఉంది. బంగాళా ఖాతంలో తుఫాన్ కారణం గా వర్షం విపరీతంగా కురుస్తోంది. రోడ్డు వెంట నీళ్ళు పొంగి పొర్లుతూ ఉంటే ముందుకు పోయే మార్గం లేక డ్రైవర్ కారును ఒక ఊరు సమీపం లో ఆపేశాడు.   ఈ వర్షం లో ఇక ముందుకు పోయే అవకాశం ఎంత మాత్రం లేదు. కారులో కూర్చోవడం కంటే సమీపం లో ఎక్కడికైనా వెళ్లి విశ్రాంతి తీసుకోవడం మంచిది అని చెప్పాడు డ్రైవరు.

తెలియని ప్రదేశం పరిచయం లేని మనుషులు నాకు కొంచెం చీకాకు అనిపించింది. గొడుగు తీసుకుని కారు దిగి నెమ్మదిగా ఆ చిన్న ఊర్లో నడవడం మొదలు పెట్టాను. ఆ ఊరు పేరేమిటో ఇప్పుడు నాకు గుర్తు లేదు కరెంటు లేదు వర్షం లో ఆ చిట్ట చీకటిలో నడవడం నా కొక పెద్ద పరీక్షలా అనిపించింది. కొంచెం దూరం వెళ్ళే సరికి దగ్గరలో ఒక చిన్న గుడి కనిపించింది. అది విశ్రాంతి తీసుకోవడానికి అనువైన ప్రదేశం అని అనిపించింది అటు వైపు గా నడిచాను. రెండు అడుగులు వేసే సరికి వర్షం మరింత ఎక్కువైంది.  గాలి తీవ్ర్రత మరింత పెరిగి నా గొడుగు ఎగిరి పోయింది   నేను పూర్తి గా తడిసి పోయాను నేను గుడిలో కి ప్రవేశి o చే సరికి ఒక వృ ద్దుడి గొంతు వినిపించింది. నన్ను లోపలకు రమ్మని పిలుస్తూ నాకు తమిళం రాదు కాని ఆ వృ ద్దు డి గొంతు  మాట తీరును బట్టి నేను వర్షం లో తడిసి పోయినందుకు ఆయన బాగా అందోళన పడుతున్నాడని తెలుసుకో గలిగాను చాల ప్రయాణాలు చేయడం వల్ల    అనుభవo తో భాష రాక పోయినా మాట తీరును బట్టి ఎదుటి వాళ్ళ భావం అర్ధం చేసుకో వచ్చు అని తెలుసుకున్నాను ఆ చీకటి లో గుడిలోకి తొంగి చూశాను అక్కడ ఒక ఎనభై సంవత్సరాల వృద్ధుడు కనుపిం చాడు ఆయన ప్రక్కన ఇంచు మించు ఆయనతో సమానమైన వయస్సుగల ఒక స్త్రీ సంప్రదాయ పద్ధతిలో నూలు చీర కట్టుకొని నిరాడంబరం గా ఉందిబహుశా ఆ వృద్దు డి భార్య అయి ఉంటుంది ఆవిడ భర్త తో ఏదో చెప్పి శుభ్రమైన ఒక పొడి తువ్వాలు పట్టుకుని నా దగ్గరకు వచ్చింది ఆ తువ్వాలు తీసుకుని ముఖం తుడుచు కున్నాను అప్పుడు గమనించాను ఆ ముసలివాడు గ్రుడ్డి వాడని వాళ్ళు ఉన్న పరిసరాలని చూస్తే వాళ్ళు చాల బీద వాళ్ళని చెప్పక్కర లేకుండానే తెలుస్తోంది నేను నిలబడి ఉన్న  ఆ గుడి శివాలయం పెద్దగా ఆడంబరాలేవీ లేకుండా సామాన్యం గా ఉంది శివ లింగం మీద ఒకే ఒక మారేడు దళం మాత్రం ఉందో అక్కడ ఒక చిన్న దీపం వెలుగుతోంది మిణుకు మిణుకు మనే ఆ దీపం వెలుగులో నాకెంతో ప్రశాంతం గా అనిపించింది ఇంతకు ముందెప్ప్పుడూ అంత ప్రశాoతతను నేను అనుభవించి ఎరుగను నేను భగవంతునికి ఎంతో దగ్గర గా ఉన్నానని పించింది  వచ్చీ రాని తమిళం లో ఆ వృ ద్దు డి ని సాయంకాలం హారతి ఇవ్వండి అని అడిగాను  చాలా అంకిత భావంతో ఆయన శివునికి హారతి ఇచ్చాడు హారతి పూర్తి అయినతరువాత పళ్ళెం లో వంద రూపాయల నోటు వేశాను  ఆయన ఆనోటు ను ఒక సారి చేతితో తాకి వెంటనే చెయ్యి వెనక్కి తీసుకున్నాడు మృదువు గా ఇలా చెప్పాడు అది పది రూపాయల నోటు అనుకున్నాను సాధారణం గా ఇక్కడ్డకు వచ్చే వాళ్ళు పది రూపాయల నోట్లే వేస్తారు మీరు ఏ గుడి కి వెళ్ళినా భక్తి ప్రధానం డబ్బు కాదు మనకున్నంత లో శక్తినిబట్టి  దానం చేయాలని పెద్దలు చెబుతూంటారు కదా నా దృష్టి లో మీ రు కూడా ఈ దేవాలయానికి వచ్చే అందరు భక్తులవంటి వారే మీ డబ్బులు వెనక్కి తీసుకోండి  ఆయన మాటలు విని నాకేం చెప్పాలో తోచలేదు నేను వేసిన వంద రూపాయల నోటు వెనక్కి తీసుకున్నాను చివరి మాటగా నేను వాళ్ళతో ఇలా అన్నాను మీరు పెద్ద వాళ్ళు ఈ ముసలి తనం లో మిమ్మల్ని చూసుకోవడానికి మీకు పిల్లలు లేరు ముసలితనం లో కుటుంబ పోషణ కవసరమైన వస్తువుల కంటె వైద్య సహాయం మీకు ఎక్కువగా అవసర మవుతుంది ఈ వూరు పట్టణానికి చాల దూరం గా ఉండి మీరు ఏమీ అనుకోను అంటే ఒక మాట చెబుతాను ఒక్క నిముషం ఆలోచించాను అప్పటికి మేము ఒక వృద్ధా శ్రమం నడపుతున్నాను ముసలి వాళ్లకు పించను పేరుతొ కొంత ఆర్ధిక సహాయం కూడా చేస్తున్నాము. వాళ్ళు కట్టుకున్న చిరిగి పోయిన బట్టలు చూస్తుంటే నేను సహాయ పడడానికి వీళ్ళు ఎంతగానో తగినవాళ్ళు అనిపించింది ఆ మాటే వాళ్ళతో చెప్పను అప్పుడు ఆ ముసలాయన భార్య ఇలా అంది మీరు మంచి పని చేస్తున్నారు బాబూ మేము కూడా మీకు కొంత డబ్బు పంపుతాము దాన్ని ఒక జాతీయ బాంకు లేదా పోష్టాఫీసు లో డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీ తో అత్యవసరం గా వైద్య సహాయo కావలసినవారికి సహాయం చేయండి  ఈ మాటలు విని ఆ ముసలాయన ముఖం అనందం తో వెలిగి పోయింది నువ్వు మాకంటే చిన్నవాడివి లా ఉన్నావు చాల తెలివి తక్కువగా ఆలోచిస్తున్నావు ఈ వృద్ధాప్యం లో మాకు డబ్బెందుకు పరమేశ్వరుడికి వైద్య నాధుడు అని పేరు ఉంది నీకు తెలియదా ఆయనను మించిన డాక్టరు ఎవరు మేము నివసించే ఈ ఊరిలో చాల మంది దయా స్వభావులు దానగుణం గల వాళ్ళు ఉన్నారు నేను ఈ గుడిలో పూజ చేస్తుంటాను దానికి ప్రతి ఫలం గా వాళ్ళు మాకు తిండికి సరిపోయే బియ్యం ఇతర అవసరమైన వస్తువులు ఇస్తూ ఉంటారు మేము ఇద్దరం ఆరోగ్యం గానే ఉన్నాము ఒక వేళ మాకు ఏదైనా అనారోగ్యం చేస్తే  ఈ వూరిలో ఉన్న వైద్యుడు మాకు మందులు  ఇస్తాడు మా అవసరాలు చాల తక్కువ తెలియని వాళ్ళ వద్దనుంచి మేము డబ్బులు ఎందుకు తీసుకోవాలి మీరు చెప్పినట్లు గా మేము మీ దగ్గర డబ్బులు తీసుకుని బాంకు లో వేసుకోవచ్చు అది తెలిసి ఎవడో వచ్చి ఆ డబ్బులకోసం మమ్మల్ని పీడించ వచ్చు బెదరించి ఆ డబ్బులు ఇమ్మని అడగ వచ్చు లేదా  ఆ డబ్బుల కోసం మాకు హాని తలపెట్ట వచ్చు ఈ బాధలన్నే మాకెందుకు  నీవు చాల దయా స్వభావం గలవాడవు లా ఉన్నావు అందకే పరిచయం లేని వాళ్లకు కూడా సహాయ పడాలని భావిస్తున్నావు కాని మేము ఉన్నదానితో తృ ప్తి పడే వాళ్ళం నీ దగ్గర నుంచి మాకేమీ అక్కరలేదు మమ్మల్ని ఇలా తృ ప్తి గా బ్రతకనియ్యి నాయనా.  ఈ మాటలు వినేసరికి ధనవంతుడననే నా అహంకారం ఒక్క సారిగా పటా పoచలయి oది తృప్తితో జీవించే ఆ ముసలి దంపతుల కంటె మానసికంగా నేనెంత పేద వాడినో తెలిసి వచ్చింది

నీ తి :– భగవంతుని మీద విశ్వాసం సంతోషాన్ని తృప్తి ని ఇస్తాయి  కోరికలకు అంతం లేదు కోరికలను పెంచుకునే కొద్దీ అవి తీరక పోతే విచారం పెరుగు తుంది పరిమితమైన కోరికలతో తృప్తి గా జీవించ గలిగిన వాళ్ళే ఎప్పుడూ ఆనందం గా ఉండ గలుగు తారు .

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s