పరోపకారం విలువ కట్టలేనిది, విలువ : సత్ప్రవర్తన అంతర్గత విలువ: దయా గుణం

 

ఇద్దరు బాలురు ఒక రోడ్డు మీద నడచి వెడుతున్నారు ఆ రోడ్డు చేల మధ్య గా పోతుంది. ప్రక్కన ఉన్న పొలం లో ఒకరైతు కష్ట పడి పని చేసుకుం టున్నాడు  అతడు తన బూట్లను ఒక చెట్టు మొదట పెట్టి పని చేసు కుంటు న్నాడు ఆ పిల్లలలో చిన్నవాడు తన కంటే పెద్ద వాడైన తన మిత్రునితో మనం ఈ రైతు బూట్లు దాచేద్దాం, అతడు కొంచెం సేపటి తరువాత వచ్చి బూట్లు కనపడక పొతే మొహం ఎలా పెట్టుకుంటాడో చూద్దాం అన్నాడు. ఆ పిల్లలలో పెద్దవాడు ఒక్క క్షణం ఆలోచించి ఆ రైతు కట్టుకున్న బట్టలు  చూస్తే అతడు  చాల బీద వాడిలా కనిపిస్తున్నాడు. నువ్వు చెప్పినట్టు కాకుండా మనం ఒక పని చేద్దాం. అతని రెండు బూట్లలో రెండు వెండి డాలర్లు పెట్టి ఆ బూట్లను పొదలలో పడేద్దాం అప్పుడు ఆ రైతు ఏమి చేస్తాడో చూద్దాం అన్నాడు.రెండవ పిల్లాడు కూడా దానికి ఒప్పుకున్నాడు. అనుకున్నట్లుగానే ఆ పిల్లలు ఆ రైతు రెండు బూట్లలో రెండు వెండి డాలర్లు ఉంచి ఆ బూట్లను పొదలలో దాచేశారు. ఆ రైతు వచ్చి ఏమి చేస్తాడో చూద్దామని వాళ్ళు కూడా పొదలలో కనపడ కుండా కూర్చొని గమనిస్తున్నారు

చాలా సేపటికి ఆ రైతు వచ్చాడు. అతడు బాగా అలసి పోయి ఉన్నాడు. ఒళ్లంతా చెమట పట్టింది తన బూట్లకోసం వెతుక్కున్నాడు. పొదలలో పడి ఉన్న ఒక బూటును పైకి తీసాడు ఆ బూటు అడుగున ఒక వెండి నాణెం కనిపించింది అది చూసి ఆశ్చర్య పోయాడు. ఆ నాణేన్ని వేళ్ళ మధ్య ఉంచుకుని అన్ని వైపులా చూశాడు. ఎవరూ కనబడ లేదు అది కలా నిజమా అని అయోమయం లో పడి పోయాడు  రెండో బూతో తీసి చూసే సరికి దాల్లో ఇంకో వెండి డాలరు కనిపించింది అతడు అంతు లేని ఆశ్చర్యం లో మునిగి పోయాడు. ఇక్కడ నేను ఒక్క డి నే ఉన్నాను ఈ నాణేలను ఈ బూట్లలో ఎవరు పెట్టి ఉంటారు అను కున్నాడు. కృతజ్ఞతాపూర్వకo గా భక్తి తో భగవంతుడికి నమస్కరిం చాడు ఆనందంతో కేకలు పెట్టాడు. కళ్ళలో ఆనంద బాష్పాలు పెల్లుబికి వచ్చాయి. ఆ రైతు అనారోగ్యం తో బాధ పడుతున్న తన భార్యకు, ఆకలితో అలమటిస్తున్న తన పిల్లలకు ఈ విషయం చెప్పాడు. తనకు తెలియకుండానే తనకు సహాయ పడిన చేతులకు మరొకసారి కృ148678950తజ్ఞతలు తెలుపుకున్నాడు.

ఇదంతా చాటు నుంచి గమనిస్తున్నా ఆ పిల్లలు ఆ రైతు వెళ్ళి పోయాక బయటకు వచ్చి మళ్ళీ తమ గమ్య స్థానానికి నడవడం మొదలు పెట్టారు.తమకు తెలియ కుండానే ఒక బీద రైతుకు అత్యవసర సమయం లో సహాయపడగల్గినందుకు వాళ్ళ మనస్సు అపరిమితమైన ఆనందంతో నిండి పోయింది.

నీతి:– దయాగుణం తో చేసిన ఒక చిన్న పని ఒక్కొక్కప్పుడు ఇతరులకు మహోపకారం అవుతుంది. అలా చేయడం ఇచ్చిన వాళ్లకు పుచ్చు కున్న వాళ్లకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది.  అందుచే ఇతరులకు సహాయపడే అవకా శo వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ అవకాశాన్ని ఎంతమాత్ర్రము జారవిడుచుకోకూడదు.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s