ఆత్మీయత

image.png

విలువ :ప్రేమ

అంతర్గత విలువ :శ్రద్ధ, ఇతరుల కష్ట సుఖాలు గమనించడం తగిన రీతిగా ప్రతిస్పందించడం

జాక్ అనే oka యువకుడు ఉండేవాడు. చిన్న తనం లో అతని తండ్రి మరణించాడు. వాళ్ళ కుటుంబం తో చనువు కలిగిన బెల్సర్అనే ఒక వృద్ధుడు జాక్ ను ఎంతో ప్రేమగా చూస్తూ అతనికి కర్రతో వస్తువులను తయారు చేయడం (carpentary) నేర్పించాడు .

కాల క్రమంలో జాక్ కాలేజీకి వెళ్లి చదువు కోవడం ,ఆడ పిల్లలతో స్నేహాలు ఉద్యోగం తీరుబడి లేని జీవన గమనం తన కల లను నిజం చేసుకోవడానికి విదేశాలకు వెళ్ళడం మొదలైన వాటితో క్షణం తీరిక లేకుండా అయిపోయాడు.జాక్ ఆ వృద్దుడిని చూసి చాలా కాలమయింది కూడా. జాక్ కు గతం గురించి ఆలోచించడానికి క్షణం కూడా తీరిక లేదు. తన భవిష్యత్తును తీర్చి దిద్దు కోవడానికి అతడు నిరంతరం శ్రమిస్తున్నాడు. ఈ విషయం లో అతనిని ఏ శక్తి ఆప జాలదు

ఒకరోజున జాక్ తల్లి ఫోన్ చేసి బెల్సర్ మరణించాడని ,ఆయన అంత్య క్రియలు తరువాత రాబోయే బుధవారం నాడు జరుగు తాయని చెప్పింది. జాక్ కు తన చిన్న నాటి సంఘటనలు ఒక దాని వెంట అంతకు ముందు చూసిన సినిమా లో వలె గుర్తుకు వచ్చాయి. జాక్ నేను చెప్పింది వినిపించిందా అని అడిగింది తల్లి. అమ్మా క్షమించు నీవు చెప్పింది వినిపించింది చాలా రోజు లయి పోయింది కదా నేను నిజం చెబుతున్నాను ఆ వృద్ధుడు బెల్సర్ చాలా కాలం క్రిందటే చనిపోయాడని నేను అనుకున్నాను అన్నాడు.

జాక్ తల్లి ఇంకా ఇలా చెప్పింది. “జాక్ ! బెల్సర్ నిన్ను మరచి పోలేదు.నేను కనిపించి నప్పుడల్లా నిన్ను గురించి అడుగుతూ ఉండేవాడు. నువ్వు తనతో ఉన్న రోజులు గుర్తుకు తెచ్చుకునే వాడు అని కూడా చెప్పింది. ఆయనను నేను కూడా ఎంతగా నో ప్రేమిస్తున్నాను అని జాక్ బదులు చెప్పాడు. మీ తండ్రి గారు మరణించిన తరువాత ఆయన మన ఇంటికి వచ్చి నిన్ను ఒక మంచి ప్రయోజకుడయిన వ్యక్తి గా తీర్చి దిద్దదానికి ఎంతో కృషి చేశారు అని గుర్తు చేసింది కూడా.

ఆయన నాకు కార్పెంటరీ నేర్పించారు. చాలా సమయం కేటాయించి నాకు అనేకమైన విషయాలు చెప్పేవారు. ఆయన సహకారం లేకపోతే నేను ఇప్పుడు ఈ వ్యాపారం లో ఉండగలిగే వాడిని కాదు. ఆయన అంత్య క్రియలనాటికి నేను తప్పక అక్కడ ఉంటాను అని జాక్ తల్లి కి సమాధానం చెప్పాడు.

ఎంత తీరిక లేకున్నా జాక్ వెంటనే అందుబాటులో ఉన్న విమానం లో బెల్సర్ అంత్య క్రియలకు హాజరు అయ్యాడు. బెల్సర్ అంత్యక్రియలు పెద్దగా గుర్తించ దగిన అంశం ఏమీ కాదు. ఎందుచేత నంటే ఆయనకు సంతానం లేదు.ఆయన బంధువులలో చాలా మంది చనిపోయారు. అంత్య క్రియలు పూర్తి అయ్యాక జాక్ అతని తల్లి తమ ఇంటికి ప్రక్కనే ఉన్న బెల్సర్ పాత ఇంటిని ఒకసారి చూసి వెళ్ళాలని అనుకున్నారు. జాక్ వెళ్లి ఆ ఇంటి తలుపును తెరచాడు. గుమ్మం లో ఒక్క క్షణం నిలబడిన జాక్ కు మరో లోకం లోకి వెళ్తున్న అనుభూతి కలిగింది.ఆ ఇల్లు ప్రతి అంగుళం జాక్ కు బాగా గుర్తుంది. ఇంటిలోని ప్రతివస్తువు ప్రతి చిత్రం జాక్ కు ఎన్నో పాత జ్ఞాపకాలను గుర్తు చేశాయి. ఒక చోట జాక్ కదలకుండా నిలబడి పోయాడు.. ఏమైంది జాక్ అని అడిగింది తల్లి. ఆ పెట్టె కనబడడం లేదు అన్నాడు జాక్ ఏ పెట్టె అని అడిగింది తల్లి ఇక్కడ ఈ బల్ల మీద ఒక చిన్న బంగారు పెట్టె ఉండేది. దాన్ని ఈ బల్ల మీద ఉంచి బెల్సర్ ఎప్పుడూ తాళం వేసి ఉంచే వాడు. దాంట్లో ఏమి ఉంది అని కొన్ని వేల సార్లు అడిగాను. అతడు విలువైనది గా భావించే వస్తువు ఉందని సమాధానం చెప్పేవాడు. అంత విలువైన వస్తువు ఏమిటో నాకు తెలియదు. ఆ పెట్టె కనబడడం లేదు మిగిలిన వస్తువులు అన్నీ ఉన్నవి ఉన్నట్లే ఉన్నాయి. బహుశా బెల్సర్ కుటుంబానికి చెందిన వారెవరో ఆ పెట్టె తీసుకుని వెళ్లి ఉంటారు. అనుకున్నాడు జాక్ ఆ మాటే తల్లి తో చెప్పాడు;

జాక్ మళ్ళీ తన వ్యాపార వ్యవహారాలలో మునిగి పోయాడు. బెల్సర్ చనిపోయి రెండు వారాలు గడచి పోయాయి. ఒక రోజున జాక్ తన పనులు చక్క బెట్టుకుని ఇంటికి వచ్చే సరికి ఉత్తరాల పెట్టె లో ఒక కాగితం మీద ఇలా వ్రాసి పెట్టి ఉంది. ఒక పార్సెల్ అందజేయడానికి మీ సంతకం కావాలి. ఇంటిలో ఎవరూ లేక పోవడం చేత పార్సెల్ అందజేయ లేకపోయాము. రెండు మూడు రోజులలో ప్రధాన తపాలా కార్యాలయము వద్ద కు వచ్చి మీ పార్సెల్ తీసుకోండి.మరుసటి రోజు ఉదయం పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి జాక్ ఆ పార్సెల్ తీసుకున్నాడు. దాన్ని తెరచి చూశాడు. ఆ పార్సెల్ చాలా కాలం క్రిందట పంప బడినట్లు ఉంది. చిరునామా స్పష్టం గా లేక పోవడం చేత అతి కష్టం మీద చదవ గలిగాడు. ఆ పార్సెల్ పంపిన వారి చిరునామా అతి కష్టం మీద మిష్టర్ బెల్సర్ ది అని జాక్ గుర్తించ గలిగాడు. జాక్ ఆ పెట్టెను తన కారు వద్దకు తీసుకుని వెళ్లి దానిని తెరచి చూసాడు. ఆ పార్సెల్ లోపల ఒక బంగారు పెట్టె ,దాని తో పాటు ఒక కవరు ఉన్నాయి. జాక్ చేతులు సన్నగా వణక సాగాయి. ఆ కవరు తీసి దాంట్లో వ్రాసి పెట్టిన ఉత్తరం చదివాడు. దాంట్లో ఇలా వ్రాసి ఉంది.

నేను చని పోయిన తరువాత ఈ పెట్టె దీనిలో వస్తువులు జాక్ కు అందజేయండి. ఇది నా జీవితం లో చాలా విలువైనది. ఆ ఉత్తరం తో పాటు ఒక తాళం చేవ్వి కూడా జత చేయ బడి ఉంది. జాక్ జాగ్రత్త గా ఆ తాళం చెవి తో ఆ పెట్టె తెరిచి చూసాడు. దాల్లో ఒక అందమైన బంగారు వాచ్ ఉంది. దాని కవర్ తీసి చూసే సరికి దాని మీద నాకోసం నీ విలువైన సమయం కేటాయించి నందుకు కృతజ్ఞతలు అని వ్రాసి ఉంది. జాక్ ఒక్క క్షణం , ఆ వాచీ చూస్తూ ఉండి పోయాడు తన అసిస్టెంట్ ను పిలచి జాక్ ఆ రోజు తన కార్యక్రమములను అన్నిటిననీ రద్దు చేయమని చెప్పాడు. అతని అసిస్టెంట్ ఆశ్చర్యం గా ఎందుకు అని అడిగాడు. ఈరోజు నా కొడుకు తో కొంతకాలం గడపాలని అనుకుంటున్నాను అని జాక్ సమాధానం చెప్పాడు. ఇంకా జాక్ తన అసిస్టెంట్ జేనెట్ ను చూసి నీ విలువైన సమయాన్ని నాకోసం కేటాయిస్తున్నందుకు నా కృ త జ్ఞతలు అన్నాడు.

నీతి:–చాలా మంది తమకోసం తమకు ఆప్తులైనవారు కొంత సమయం కేటాయించచాలని మరియు తమ పట్ల శ్రద్ధ చూపిం చాలని కోరుకుంటారు. కానీ అలా చేయడానికి చాలామందికి క్షణం కూడా తీరిక దొరకదు. మనం ప్రేమించే మన పిల్లల విషయం లోను ,మన పైన మమకారం గల పెద్దవాళ్ళ విషయం లోను మనం కొంత సమయం కేటాయించి వాళ్ళను ఆనందం గా ఉండ గలిగేలా చేయడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. మనం వాళ్ళకోసం కేటాయించే ఆ కొద్ది సమయం వాళ్ళకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

 

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s