Archive | October 2015

సిద్ధార్థ్ – పూజ !!! విలువ: సత్యం అంతర్గత విలువ: నిజాయితీ

image

సిద్ధార్థ్ అనే బాబు, పూజ అనే పాప ఆడుకుంటున్న్నారు. సిద్ధార్థ్ దగ్గర కొన్ని గోళీలు, పూజ దగ్గర కొన్ని స్వీట్స్ ఉన్నాయి. సిద్ధార్థ్ తన దగ్గర ఉన్న గోళీలు ఇస్తానని బదులుగా స్వీట్స్ ఇమ్మని పూజని అడిగాడు.అందుకు పూజ అంగీకరించింది. సిద్ధార్థ్ తన దగ్గర ఉన్న వాటిలో పెద్ద గోళీని దాచిపెట్టి మిగిలినవి మాత్రం పూజకి ఇచ్చాడు. పూజ మాత్రం నిజాయితిగ స్వీట్స్ అన్నీ ఇచ్చేసింది. ఆడుకోవడం అయిపోయక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. పూజ ప్రశాంతంగా నిద్రపోయింది. సిద్ధార్థ్ మాత్రం పూజ నిజంగా అన్ని స్వీట్స్ ఇచ్చిందా లేదా తనలాగ ఏమయినా దాచిందా అని అలోచిస్తూ సరిగా నిద్రపోలేకపోయాడు.

నీతి: మన కుటుంబసభ్యులయినా, స్నేహితులయినా మనం వారిని ప్రేమిస్తే వారితో నిజాయితీగా ఉండాలి.నిజమైన బంధం నమ్మకం మీద నిలబడుతుంది.మన ప్రవర్తన సరిగా ఉంటేనే బంధాలు నిలుస్తాయి,మనశ్శాంతి కూడా ఉంటుంది. లేదంటే అందరినీ అనుమానిస్తూ ప్రశాంతంగా ఉండలేము.

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

Advertisements

బ్రహ్మచారిణి

image
‘దధనా కరపద్మాభ్యం అక్షమాలా కమండలా
దేవీ ప్రేదతు మయీ బ్రహ్మే చారిణ్యనుత్తమా ‘

  • ఒక చేత జపమాల, మరో చేత జలపాత్ర ధరించిన బ్రహ్మచారిణీ మాత సాధకునిలో సదాచారాన్ని ప్రవేశపెడుతుంది. ఈమె నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుంది.
    శివుణ్ణి పతిగా పొందేందుకు తపించిపోయిన రాజకన్య . ఈమెను ఆరాధిస్తే మనస్సుకు ఎకాగ్రత కలుగుతుంది

శైలపుత్రీ

image

ప్రధమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణీ!
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చథుర్ధకమ్!
పంచమమ్ స్కంధమంతేతి షష్టం కాత్యాయనతిచ!
సప్తమం కాళరాత్రేతి మహాగౌరీతి అష్టమం!
నవమ సిధ్ధిధాత్రీచ నవదుర్గాః ప్రకీర్తితాః

అని తొమ్మిది నవదుర్గ స్వరూపాలు. ఒక్క దుర్గ నవదుర్గలుగా భాసించి తొమ్మిది రూపాలను ధరించింది. అమ్మవారు ఒక్కొక్క రూపాన్ని స్వీకరించింది. అంటే దాని వెనుక ఒక తాత్పర్యం ఉంది. లోకానికి ఆవిడ ఎన్నో విషయాలను ప్రబోధం చేసి ఆవిడ అనుగ్రహాన్ని మన మీద ప్రసరిస్తుంది. అమ్మవారు తీసుకున్న నవదుర్గ స్వరూపాలలో మొట్టమొదటిది శైలపుత్రీ. శైలపుత్రీ అనగా పర్వతరాజు యొక్క కూతురు. అమ్మవారు వారి ఉపాసనా బలాన్ని బట్టి, వారిలో ఉన్న ఆర్తిని బట్టి ఎంతోమందికి కూతురుగా వచ్చింది. పర్వతరాజు పుత్రిక శైలపుత్రికగా, కాత్యాయన మహర్షి పుత్రిక కాత్యాయినిగా, భ్రుగుమహర్షి పుత్రిక భార్గవిగా, జనకమహారాజుగారి పుత్రిక జానకిగా ఇలా ఎంతో మందిని ఆ తల్లి అనుగ్రహించింది. నిజానికి ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఆ తల్లి స్వరూపమే. ముందుగా మనము అసలు ఆ తల్లి శైలపుత్రిగా రావడానికి కారణం తెలుసుకుంటే ఆ శైలపుత్రీ తత్వం, అసలు ఆ అవతారం స్వీకరించడానికి గల కారణం, ఆ అవతారం యొక్క ప్రాముఖ్యత మనకి అవగతం అవుతుంది.

ఆ తల్లి కోరుకున్న మాత్రంచేత ఎందరినో అనుగ్రహించి కూతురుగా వచ్చినా ఆ తల్లి మహా పతివ్రత కాబట్టి భర్తగా ఆ పరమశివుడినే పొందుతుంది. ఈ శైలపుత్రిగా అవతార స్వీకరణ తీసుకోవడానికి ముందు ఆవిడ దక్షుడి కూతురుగా దాక్షాయిణిగా ఉంది. ఆవిడ అనుగ్రహించి కూతురు అయింది. కాబట్టి ఆవిడ దాక్షాయిణిగా ఆ దక్షుడికి కీర్తి ప్రతిష్ఠలను అందించింది. కాని, అది గమనించనటువంటి దక్షుడు అహంకారంతో ఒకానొక బ్రహ్మ సభలో, దక్షుడు ఆ సభలోనికి ప్రవేశించినప్పుడు తనని మామగారిగా గౌరవించి లేచి నిలబడలేదన్న భేషజంతో అల్లుడిమీద కోపంతో నిరీశ్వరయాగాన్ని చేయసంకల్పించాడు. అలా అందరూ తన తండ్రి చేస్తున్న నిరీశ్వర యాగానికి బయలుదేరి వెళుతుంటే ఆ తల్లికి కోపం వచ్చింది. ఎందుకంటే ఆ తల్లి మహా పతివ్రత. ఆ తల్లి దేన్నైనా భరిస్తుంది కాని, భర్తని అవమానిస్తే సహించలేదు. కాబట్టి తండ్రికి బుద్ధి చెబుతానని పరమశివుని అనుజ్ఞ తీసుకొని దక్షుడు తలపెట్టిన యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ ఎవ్వరూ ఆ తల్లిని ఆదరించకపోయేసరికి కోపంతో తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాను అంటూ మిగిలిన వారికందరికీ తన పాతివ్రత్యాన్ని ఆవిష్కరిస్తూ లోకానికంతటికీ తీర్పు చెప్పింది. దాంతోపాటు సందేశాన్ని ఇచ్చింది. ‘భవో సహోద్వేషి శివం శివేతరః’ శివుడిని నిందించినా, దూషించినా లోకానికి మంగళములు, కళ్యాణాలు కావు. శివనింద ఎంత ప్రమాదకరమో చెప్పి ఆమె యోగాగ్నిలో శరీరాన్ని విడిచిపెట్టింది. ‘శివా రుద్రస్య భేషజీ”. ప్రశాంతంగా ఉన్న
పరమశివుని రుద్రుణ్ణి చేస్తుంది. ఈ విషయాన్ని ప్రమధగణాలు పరమశివునికి చెప్పేసరికి ఆయన రుద్రుడై తన జటాజూటంలో ఉన్న ఒక జటను పెరికి నేలమీద కొట్టగానే ఉగ్రరూపంలో ఉన్న వీరభద్రుడు ఉద్భవించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి, యాగం మధ్యలో ఆగకూడదు కాబట్టి దక్షునికి మేక తలకాయ పెట్టి యాగాన్ని పూర్తిచేశాడు. మరి ఆ తల్లి సతిగా తన శరీరాన్ని విడిచిపెట్టేసింది. పరమశివుడు తనలో తాను రమిస్తూ తపస్సుమధ్యలో ఉన్నాడు. శివపార్వతులకు పుట్టిన బిడ్డడివల్ల కదా తారకాసురవధ జరగాలి. ఇంత జరిగిన తరువాత మళ్ళీ ఆ తల్లి జన్మ ఎత్తడానికి ఒప్పుకుంటుందా? అని దేవతలందరూ బ్రహ్మగారి దగ్గిరకు వెళ్లి వారి బాధను చెప్పుకున్నారు. అప్పుడు ఆయన ఆ తల్లి జన్మించడానికి ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఆ తల్లే మేనకా హిమవంతులకు వరం ఇచ్చింది, తానే వారి కూతురిగా వస్తానని. ఒకానొక సమయాన ఆవిడ దాక్షాయిణిగా ఉన్నప్పుడు హిమవత్పర్వత ప్రాంతాలలో శివునితో కలిసి తిరుగుతూ ఉండగా, ఈ తల్లిని చూసి మేనక అనుకొన్నది, నాకు ఈవిడ కూతురైతే ఎంత బావుండును అని. ఆ తల్లి అప్పుడు మేనకను అనుగ్రహించింది, నేనే మీకు కూతురుగా పుడతాను అని. మరి వాళ్లకి కూతురిగా పుట్టాలంటే మరి మేనకా హిమవంతులు చేసుకున్న పుణ్యం ఏదైనా ఉండాలి కదా! మేనకాదేవి అష్టమి రోజు పూర్తిగా ఉపవాసము చేసి, నవమిరోజు చాలా నిష్ఠగా సువాసిని పూజ చేసింది. అందుకని మేనకా హిమవంతులకు కూతురిగా రావడానికి అంగీకరించింది. వారి ఇంట ఆడపిల్లగా పుట్టింది. తాను పుట్టడమే కాదు, వారికి ఒక అబ్బాయి మైనాకుడిని కూడా అనుగ్రహించింది.

ఆ తల్లి అనుగ్రహానికి ఎల్లలు లేవు. తమ ఇంట తిరుగుతున్న ఆ ఆడపిల్లని చూచుకొని మేనకా హిమవంతులు ఎంతో మురిసిపోయారు. మరి ఆ తల్లి వివాహం చేసుకోవాలి అంటే ఆ పరమశివుడినే వరిస్తుంది. సతీ వియోగంతో ఉన్న పరమశివుడు హిమవత్పర్వతాలపై తపస్సు చేసుకుంటూ ఉంటే దేవతలందరూ పార్వతీపరమేశ్వరుల వివాహం త్వరగా కావాలి, ఆ తారకాసురుడి బాధ మనకి వదలాలి అని దేవేంద్రుడు, మన్మధుని మన్మధబాణాలు వేయడానికి పరమశివునిపై పంపించాడు. పాపం ఆయన భయపడుతూనే వెళ్ళాడు. ఎప్పుడైతే మన్మధుడు మన్మధబాణం విడిచిపెట్టాడో, వెంటనే పరమశివుడు తన యొక్క మూడవ నేత్రంతో మన్మధుడిని భస్మం చేశాడు. కాలి, బూడిద అయిపోయిన మన్మధుని చూసి, భార్య రతీదేవి ఎంతగానో విలపించింది. మన్మధుడు లేకపోయేసరికి సృష్టి లేదు. జగత్తులో ఎక్కడా ఉత్సాహం గాని, సంతోషంగాని లేవు. అప్పుడు ఆ తల్లి మన్మధుని అనంగుడిగా ఉండమని, ఆయన చేతిలో ఉన్న బాణాలను ఆ తల్లి పుచ్చుకుని కాముడ్ని కాల్చిన పరమశివుని ప్రక్కకు శివకామసుందరిగా చేరింది. ఆ తల్లి ఆ పరమశివుణ్ణి గెలుచుకుంది. తన అందచందాలు, రూపలావణ్యాలతో కాదు. అపర్ణ అయి తపస్సు చేసింది. అలా తపస్సు చేస్తుండగా పరమశివుడే బ్రహ్మచారిగా వచ్చి శివనింద చేస్తే సహించలేక గెంటించబోతే, అప్పుడు ఆ సుందరస్వరూపుని (పరమశివుని) గాంచింది. ఆ తల్లి ఒక రకంగా ఈ శైలపుత్రీ బాలా స్వరూపంగా ఉన్న కుమారిగా ఉన్న ఆమె పాతివ్రత్యం అంత గొప్పది. ఆమె ఎప్పుడు ఆయనకు ఇల్లాలు. ‘మహామాయా విశ్వమ భ్రమయసి పరబ్రహ్మ మహిషి’.

ఈ రోజు మహా పతివ్రత అయిన శైలపుత్రీ అవతారంతో ఆ తల్లిని అర్చన చేసి మనందరం కూడా ఆ తల్లి యొక్క కృపా కటాక్షవీక్షములకు పాత్రులం అయ్యెదము గాక.

సర్వేజనా సుఖినోభవంతు

శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి

+91 8125126111

ముసలి గాడిద!! విలువ:ధర్మం , అంతర్గత విలువ:ఆశావాద ధృక్పధం

image

ఒక రైతు దగ్గర ఒక ముసలి గాడిద ఉండేది. ఒకరోజు అది ఇంటిపక్కన ఉన్న బావిలో పడిపోయింది.దాని అరుపులు విన్న రైతు బావి దగ్గరకు వెళ్ళి చూశాడు. ముందు దాని పరిస్థితి చూసి జాలిపడ్డాడు కాని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేడు. ఇరుగు పొరుగు వారిని పిలిచి ఆ గాడిద ముసలిది అయిపోయింది కాబట్టి దానివల్ల ఉపయోగం లేదని అలాగే బావి కూడా పాడుబడిపోయింది కాబట్టి మట్టి వేసి ఆ గాడిదని అందులోనే పూడ్చేద్దామని, సాయం చెయ్యమని అడిగాడు.
ఇదంతా విన్న గాడిద అయోమయంలో పడింది.యజమాని ఇన్నాళ్ళు సేవ చేయించుకుని చివరికి ఇంత స్వార్థంగా చంపేస్తున్నాడని బాధపడింది. అది బాధలో నుండి తేరుకునేలోపే రైతు మిగతవాళ్ళతో కలిసి తట్టలతో మట్టిని బావిలోవేయించసాగాడు. దానికి వెంటనే ఒక ఆలోచన తట్టింది. మట్టి మీద పడగానే దులుపుకుని పైకిగెంతేది దానివల్ల మట్టి పెరిగేకొద్దీ గాడిద కూడా పైకి రాసాగింది. అల చివరకు బావి అంచుకి రాగానె బైటికి దూకి ప్రాణాలు కాపాడుకుంది.

నీతి: కష్టాలు వచ్చినపుడు బాధపడుతూ ఉండిపోతే ప్రయోజనం లేదు. వచ్చిన కష్టం నుండి నేర్చుకోవలసిన పాఠం ఏమిటో గ్రహించి ఆశావాదధృక్పధంతో బైటికి వచ్చే ప్రయత్నం చెయ్యాలి. అలాగే కృతజ్ఞత లేనివాళ్ళకి ఎంతసాయం చేసినా ఉపయోగం ఉండదు.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

ఐకమత్యమే బలము !విలువ :ప్రేమ ;అంతర్గత విలువలు : సహనము , ఐక్యత

image
ఒక ప్రాచీన దేవాలయం పై భాగం లో కొన్ని పిచ్చుకలు నివసించేవి దేవాలయం ఉత్సవాల సందర్భం గా ఆ దేవాలయమును మరమ్మత్తు చేయడం మొదలు పెట్టారు ఆ పిచ్చుకలు సమీపం లోని చర్చ్ లో నివసించా సాగా యి కొంతకాలం తరువాత క్రిస్ట్మస్స్ (Christmas) సందర్భం గా చర్చి రిపేర్ చేయడం మొదలు పెట్టారు అప్పుడు ఆ పిచ్చుకలు సమీపం లోని మసీదు లోనికి మకాం మార్చాయి మరల కొంత కాలానికి రంజాన్ పండుగ సందర్భంగా మసీదు రిపేర్ చేయడం మొదలు పెట్టారు అప్పుడు ఆ పిచ్చుకలు తాము మొదట ఉండే దేవాలయం లోకి వచ్చి నివసించ సాగాయి.
ఒకరోజు ఆ పిచ్చుక పిల్లలు ఒక బజార్ కూడలి లో కొంతమంది మత కలహాలతో కొట్టుకుంటున్న జన్నాన్ని చూసి అమ్మా వీళ్ళు ఎవరు అని తల్లిని అడి గాయి. వాళ్ళు మనుష్యులు అని సమాధానము చెప్పింది తల్లి. వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు అని మళ్ళీ అడిగాయి వీళ్ళల్లో దేవాలయానికి వెళ్ళే వాళ్ళని హిందువులు అని చర్చి కి వెళ్ళే వాళ్ళని క్రైస్తవులు అని మసీదుకు వెళ్ళే వాళ్ళని ముస్లిములు అంటారు అని తల్లి చెబుతూంటే ఒక పిచుక పిల్ల తల్లిని ఇలా అడిగింది
అదేమిటి మసీదులో ఉన్నా చర్చి లో ఉన్నా దేవాలయం లో ఉన్నా మనల్ని పిచ్చుకలు అని పిలచినట్లే వీళ్ల నందరిని మనుష్యులు అని పిలవాలి కదా? దానికి తల్లి పిచ్చుక ఇలా సమాధానం చెప్పింది అదృష్ట వశ ము చేత మనం భగవదను భ వాన్ని పొందగాలిగాం అందుచేత ఎక్కడ ఉన్నా మనం ఒక లగే ఉన్నాం ఒకేలా చూడ బడుతున్నాం వీళ్ళు ఇంకా భగ వదను భవాన్ని పొందలేదు అందుచేతనే మన కంటే క్రింద నివసిస్తున్నారు
నీతి:మనమంతా ముందుగా మనుష్యులం అందరం ఒకే విధంగా ఉంటాం మనమందరం ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రే మగా ఉన్నపుడు మాత్రమే ఈ ప్రపంచం ప్రేమ మాయమై ప్ర శాంతం గా ఉంటుంది

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

ప్రతి ఫలాపేక్ష లేకుండా సేవ చేయాలి !!!విలువ :ప్రీతీ ,అంతర్గత విలువ — దయ

imageచాలాకాలం క్రిందట నేను ఒక ఆసుపత్రి లో స్వయం సేవకుడు గా పని చేసేవాడిని అక్కడ L I Z అనే పేరు గల ఒక అమ్మాయి చాల అరుదైన ఒక వ్యాధి తో తీవ్రం గా బాధ పడుతోంది ఆమె బ్రతక డా నికి గల ఒకే ఒక అవకాశం ఆమె ఐదు సంవత్సరాల తమ్ముడి రక్తాన్ని ఆమెకు ఎక్కించడం మాత్రమే ఆ పిల్లవాడు కూడా ఒకప్పుడు అలాటి వ్యాధి తో బాధ పడి ఒక అద్భుత మా అనే టట్లు బ్రతికాడు ఆ వ్యాధి క్రిములతో పోరాడే వ్యాధి నిరోధ శక్తి గల anti bodies ఆ పి ల్లవాడి లో ఉత్పన్న మయ్యాయి అందు చేత ఆ పిల్లవాడి రక్తాన్ని ఆ బాలిక కు ఎక్కిస్తే ఆమె వ్యాధి తగ్గే అవకాశం ఉంది డాక్టర్ ఆ విషయాన్ని ఆ పిల్లవాడికి వివరించి చెప్పి అతనికి ఇష్టమైతే వాళ్ళ అక్కకు రక్త దానము చేయమని చెప్పాడు ఆ పిల్లవాడు ఒక్క నిముషం సందేహించి పెద్దగా ఊపిరి పీల్చి నేను ఇచ్చే రక్తం మా అక్కను బ్రతికిస్తుం దం టే తప్పక ఇస్తాను అని ఒప్పుకున్నాడు ఆ పిల్లవాడిని వాళ్ళ అక్క మంచం ప్రక్కన మరొక మంచం మీద పడుకోబెట్టి రక్త మార్పిడి చికిత్స ప్రారంభించారు రక్త మార్పిడి జరిగే కొద్దీ ఆ బాలిక చెక్కిళ్ళు ఎరుపు రంగు లోకి రాసాగాయి ఆ పిల్లవాడి ముఖం పాలి పో సాగింది అప్పుడు ఆ పిల్లవాడు భయం తో వణకి పోతూ నేను చనిపోతున్నానా అని డాక్టర్ ను అడిగాడు చిన్నతనం కావడం చేత ఆ పిల్లవాడు డాక్టర్ చెప్పిన మాటలు సరిగా అర్ధం చేసుకో లేక పోయాడు వాళ్ళ అక్కను రక్షించ దానికి తన శరీరం లోని రక్తం పూర్తిగా ఇచ్చే యాలని అనుకున్నాడు

నీతి :ప్రతిఫలాపేక్ష లేకుండా పని చేయాలి అందరి యందు ప్రేమ కలిగి వుండా లి కానీ మనం బాధ పడే టట్లు ఉండకూడదు మనకు నచ్చినట్లు ఉండవచ్చు కాని ఇతరులు గమనించకుండా చూసుకో వాలి

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

ఇక్కడ కుక్క పిల్లలు అమ్మబడును !విలువ :చక్కని నడవడిక లేదా సత్ ప్రవర్తన అంతర్గత విలువ – ఇతరుల భావాలను అర్ధం చేసుకోవడం

image

ఒక రైతు వద్ద కొన్ని కుక్క పిల్లలు ఉన్నాయి వాటిని అతడు తన అవసరం కోసం అమ్ముకోవాలని అనుకున్నాడు ఇక్కడ కుక్క పిల్లలు అమ్మబడును అని ఒక బోర్దు మీద అందంగా వ్రాసి తన పొలం లో ఒక ప్రక్కన ఒక స్తంభానికి అతికిస్తున్నాడు అంతలో ఆ రైతు తనని ఎవరో తాకినట్లు అనిపించి క్రిందికి చూశాడు అక్కడ ఒక పిల్లవాడు కనిపించాడు ఆ పిల్లవానిని చూసి రైతు ఏం కావాలని అడిగాడు మీ దగ్గర ఉన్న కుక్కపిల్లలలో ఒకదానిని నేను కొనుక్కోవాలని అను కుంటున్నాను అని ఆ పిల్లవాడు సమాధానం చెప్పాడు మంచిది అలాగే అన్నాడు రైతు చెమటను తుడుచుకుంటూ ఈ కుక్కపిల్లలు జాతి కుక్కలకు పుట్టిన పిల్లలు అందుచేత కొంచెం ఖరీదు ఎక్కువ అన్నాడు!

ఆ పిల్లవాడు ఒక్క నిముషం తలవంచుకుని జేబులో చెయ్యి పెట్టి కొంత చిల్లర చేతిలోనికి తీసుకుని నావద్ద 39 సెంట్లు ఉన్న్నాయి మీ దగ్గర ఉన్న కుక్కపిల్లలను ఒకసారి చూడదానికి ఇవి సరి పోతాయా అని అడిగాడు తప్పకుండా చూడవచ్చు అన్నాడు రైతు. రైతు డాలీ అని పిలుస్తూ ఈల వేశాడు ఆ కుక్కల గూటి లోంచి ఒక కుక్క దానివెనుక నాలుగు పిల్లలు బయటికి వచ్చాయి అక్కడ కంచె మీద తల ఆన్చి ఆ పిల్లవాడు ఆ కుక్కపిల్లలని చూస్తున్నాడు వాడి కళ్ళలో ఆనందం తాండవిస్తోంది ఆ కుక్క పిల్లలని చూసి.
నెమ్మదిగా ఆ కుక్కపిల్లలు వాళ్ళు నుంచున్న చోటినుంచి కంచె దాటి వెళ్లి పోయాయి కుక్కల గూటిలో ఇంకా ఏదో ఉన్నట్టు ఆ పిల్లవాడి కి అనిపించింది కొంచెం సేపటికి మరొక చిన్న
కుక్కపల్లి ఆ గూటిలోంచి గోడ ప్రక్క నించి నెమ్మది గా జారుతూ బయటకు వచ్చిం ది ఆ కుక్క పిల్ల నెమ్మది గా నడవలేక నడవలేక నడుస్తూంది ముందు వెళ్ళిన కుక్కపిల్లలను చేరుకోవాలని ఆ కుక్కపిల్ల అతి కష్టం మీద నడవడానికి ప్రయత్నిస్తోంది
ఆ కుక్కపిల్లను చేతితో చూబిస్తూ నాకీ కుక్క పిల్ల కావాలి అన్నాడు ఆ పిల్లవాడు రైతుతో బాబూ అది నీకు వద్దు మిగిలిన కుక్క పిల్లల లాగ అది నీతో పరుగెత్త లేదు ఆడ లేదు అన్నాడు రైతు ఈ మాటలు విని ఆ పిల్లవాడు రెం డ డుగులు వనక్కి వేసి కొంచెం క్రిందికి వంగి తాను వేసుకున్న trouser ఒక కాలి మడత పైకి తీసి ప్రత్యేకం గా ఉన్న తానూ తొడుక్కున్న బూటు అందులోంచి ఒక స్టీల్ ఊచ తీసి చూబించి ఆ కుక్క పిల్ల లాగే నేను కూడా బాగా పరుగెత్త లేను అందుచేత అది నన్ను బాగా అర్ధం చేసుకుంటుంది అన్నాడు

నీతి– ప్రతివాళ్ళు ఎదుటి మనోభావాలను అర్ధం చేసుకుని దానికనుగుణం గా నడచు కోవడానికి ప్రయత్నించాలి చాల మంది ఎదుటి వాళ్ళు తమను అర్ధం చేసుకోవాలని కోరుకుంటారు ఎదుటి వారిని అర్ధం చేసుకుని వారితో మృ దువు గా వ్యవహరిస్తే వాళ్ళలో ఆత్మా విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంపొందింపవచ్చు!

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu