కలలను వ్యాఖ్యానించిన పక్షి

విలువ: అహింస
ఉపవిలువ: సానుకూల భావములు

 

King dreaming

రాజు అనబడే ఒక యువరైతు తన పొలంలో చాలా కష్టపడి పనిచేసేవాడు. ఒక రోజు సాయంకాలం రాజుగారు ఒక దండోరా వేయించారు “రాజు గారికి వచ్చిన కలకు సరైన అర్ధం చెప్పగలిగినవారు ఏవరైనా సరే వారికి నూరు బంగారు నాణెములు బహుమతిగా ఇవ్వబడతాయి” అని. రాజుగారికి కలలో “ఒక తోడేలు తన ఒడిలోనికి గట్టిగా అరుస్తూ దూకింది.” నాకు ఈ కలకి అర్ధం తెలిస్తే బాగుండును అని తనలో తానే గొణుక్కున్నాడు రాజు. “నీకు వచ్చిన బహుమానంలో సగం నాకు ఇస్తే రాజుగారికి వచ్చిన కలకి అర్ధం చెపుతాను” అన్నది ఒక చిన్న పక్షి రాజుతో. రాజు అందుకు అంగీకరించాడు. “తోడేలు మోసానికి గుర్తు. అందువలన రాజుగారిని జాగ్రత్తగా ఉండమని చెప్పు.” అన్నది పక్షి.
రాజు వెళ్ళి రాజుగారితో ఈ కలకి అర్ధం చెప్పి బహుమానాన్ని పుచ్చుకున్నాడు. “కాని, ఇప్పుడు ఈ బహుమతిలో సగభాగం ఆ పక్షికి ఇచ్చెయ్యాలి కదా!” అనుకున్నాడు రాజు. అతను తన మనస్సును మార్చుకుని పక్షిని తప్పించుకుని వెళ్ళిపోయాడు.
అతడు ఆ డబ్బును తెలివిగా ఖర్చుపెట్టి, బాగా ధనవంతుడు అయ్యాడు. ఐదు సంవత్సరములు గడిచాయి. ఒకరోజు సాయంకాలం రాజుగారి సైన్యాధికారి రాజు ఇంటికి వచ్చి రాజుతో “రాజుగారికి మళ్ళి కల వచ్చింది. కలలో రక్తంతో తడిసిన ఒక బాకు రాజుగారి తలచుట్టూ తిరుగుతూ కనిపించింది.” భయపడిపోయిన రాజు పక్షి కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. మర్రిచెట్టు దగ్గరకి వెళ్ళగానే అతనికి సుపరిచితమైన కంఠధ్వని వినిపించింది. “నేను కలకి అర్ధం చెపితే నీకు వచ్చే బహుమానంలో సగం నాకు ఇస్తావా?” అన్నది పక్షి. ఇస్తానని ప్రమాణంచేసాడు రాజు. “బాకు హింసకి చిహ్నం కనుక రాజుగారు సరైన రక్షణలో ఉండాలని” చెప్పింది పక్షి. ఈసారి రాజుకి బహుమతిగా 1000 బంగారు నాణెములు లభించాయి.
ఈసారి కూడా అతనికి తన బహుమానంలో సగభాగం ఇచ్చిన మాట ప్రకారం పక్షికి ఇవ్వాలని అనిపించలేదు. కాని, ఒకవేళ ఈ పక్షి వెళ్ళి రాజుగారికి అసలు విషయం చెప్పేస్తే! అని భయం కలిగి పక్షి పైకి ఒక రాయి విసిరాడు. అదృష్టవశాత్తు పక్షికి ఎటువంటి గాయము కాలేదు. ఆ పక్షి ఎగిరిపోయి తప్పించుకున్నది. అలా ఏళ్ళుగడుస్తున్నకొద్దీ రాజు అసలు ఈ విషయమే మరచిపోయాడు. మళ్ళి రాజుగారికి మరొక కల వచ్చేదాకా. ఈసారి రాజుగారికి కలలో “తన ఒడిలో ఒక పావురం ఉన్నట్లుగా” కనిపించింది. మళ్ళి రాజు పక్షి దగ్గరికి వెళ్ళి పావురం అంటే “శాంతికి చిహ్నం” అని అర్ధం తెలుసుకున్నాడు. ఈసారి రాజుకి 10,000 బంగారు నాణెములు లభించాయి.

ఈసారి అతను తనకు వచ్చిన బహుమానం మొత్తాన్ని పక్షికి ఇచ్చేసాడు. కాని, పక్షి తనకు వద్దని చెప్పింది. “దయచేసి నువ్వు నన్ను క్షమించానని మాత్రం చెప్పు” అన్నడు రాజు. “మొదటిసారి వాతావరణంలో మోసం ఆవరించిఉండటం వలన నీవు నన్ను మోసం చేసావు. రెండవసారి వాతావరణంలో హింస వ్యాపించి ఉండటంవలన నీవు కూడా హింసాత్మకంగా ప్రవర్తించావు. ఇప్పుడు అంతటా నమ్మకం, శాంతి వ్యాపించి ఉండటంవలన నీవు కూడా దానికి తగిన విధంగానే ప్రవర్తించావు. కొద్దిమంది మాత్రమే తమ అంతరంగమును అనుసరించి ప్రవర్తించగలరు” అన్నది పక్షి.
నీతి: తరచుగా మనం మనచుట్టూ ఉన్న వాతావరణం, వ్యక్తుల వలన ప్రభావితమవుతూ ఉంటాము. సానుకూలధోరణి కల వ్యక్తుల మధ్య ఉంటే మనలో సానుకూలధోరణి పెంపొందుతుంది. వ్యతిరేక భావాలుకల వ్యక్తులు, పరిస్థితులు మనని క్రుంగ దీస్తాయి. అందువల్ల మనం సానుకూల ధోరణి పెంపొందించే వ్యక్తుల సాంగత్యంలో గడపాలి. ఇలా అనుకున్నప్పటికీ మనం మరింత వ్యతిరేక పరిస్థితులలో, వ్యతిరేక ధోరణి కల వ్యక్తుల సాంగత్యంలో పడిపోవచ్చును. అందువల్ల ఇలాంటి పరిస్థితులలోనే మనకి ఇటువంటి వ్యక్తులకు, పరిస్థితులకు లొంగనటువంటి “స్వంతబుద్ధి” కావాలి. ఎటువంటి సవాళ్ళనైనా, ఎటువంటి వ్యతిరేక పరిస్థితులనైనా ఎదుర్కొనగల ఆత్మశక్తిని అభివృద్ధి చేసుకోవాలి. ప్రార్ధనలు, శాస్త్రపఠనం, ఆధ్యాత్మిక సాధనలు, చైతన్య స్ఫూర్తిని కలిగించే కార్యములు చేయటం మనకి సానుకూల ధోరణి పెంపొందించే మార్గమును చూపిస్తాయి. అంతేకాకుండా మనకి అదుపులో లేని విషయాన్ని ఎదుర్కొనగల శక్థిని కలిగిస్తాయి. అయితే ఈ నేర్చుకున్నవన్నీ ఆచరణలో పెట్టగలిగినప్పుడే ఇది సాధ్యం అవుతుంది.

 

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s