స్నేహమనే ఓడ విలువ: సత్ప్రవర్తన ఉప విలువ: ఇతరుల పట్ల ప్రేమ

image

సముద్రంలో ప్రయణం చేస్తున్న ఒక ఓడ తుఫానులో చిక్కుకుని ముక్కలైపోయింది. కేవలం ఇద్దరు ప్రయాణీకులు మాత్రం ఈదుకుంటూ ఎడారివంటి ఒక ద్వీపానికి చేరుకున్నారు. వాళిద్దరూ మంచి స్నేహితులు. భగవంతుని ప్రార్ధించటం తప్ప వేరే మార్గ మేదీ లేదన్న ఉద్దేశంతో వారొక అంగీకారానికి వచ్చారు. ఎవరి ప్రార్ధన బలమైనదో తెలుసుకోవటం కోసం వాళిద్దరూ ఆద్వీపాన్ని రెండు భాగాలుగా చేసుకుని, ఎదురెదురు భాగాలలో ఉంటూ ప్రార్ధన చేయటం ప్రారంభించారు.

మొట్టమొదట వాళ్ళు ఆహారం కోసం ప్రార్ధించారు. మరునాటి ఉదయం మొదటి వ్యక్తి ఉన్న భాగంలో ఒక పండ్ల చెట్టు కనిపించింది. అతడు ఆ ఛెట్టు నించి పండుకోసుకుని తిన్నాడు. రెందవ వ్యక్తి ఉన్న స్థలంలో ఏ చెట్టు లేకుండా ఏడారిలా ఉన్నది.
ఒక వారం తరువాత మొదటివ్యకికి ఒంటరిగా అనిపించి భార్య కావాలని దేవుడిని ప్రార్ధించాడు. మర్నాడు వేరొక ఓడ సముద్రంలో ముక్కలైపోయి ఒక స్రీ మాత్రం బతికి ఈదుకుంటూ మొదటి వ్యక్తి ఒన్న భాగం వైపుకి వచ్చింది. రెండవ వ్యక్తి ఉన్న ద్వీపం భాగంలో ఏమీ లేదు.
ఆ తరువాత మొదటి వ్యక్తి ఇల్లు, బట్టలు, మరింత ఆహారం కోసం ప్రార్ధన చేసాడు. మరునాడు ఏదో మాయమంత్రం వేసినట్లుగా అతను ప్రార్ధించినవన్నీ అతనికి లభించాయి. రెండవ వ్యక్తి ఉన్న వైపు ఏమీ లేవు. చివరిగా, మొదటి వ్యక్తి తాను, తన భార్య అక్కడినించి వెళ్ళీపోవటం కోసం ఒక ఓడ కావాలని ప్రార్ధించాడు. మరునాటి ఉదయం మొదటివ్యక్తి ఉన్న ద్వీపం భాగంవైపు ఒక ఓడ నిలిచి ఉండటం కనిపించింది. మొదటి వ్యక్తి భార్యతో కలిసి ఓడనెక్కి, రెండవ వ్యక్తిని అక్కడే విడిచి వెళ్ళి పోవాలని నిశ్చయించుకున్నాడు.రెండవ వ్యక్తికి ఏదీ లభించకపోవటం వలన అతని ప్రార్ధనలలో బలం లేదని మధిటి వ్యక్తి భావించాడు.
ఓడ కదలబోతుండగా స్వర్గలోకం నుంచి ఒక స్వరం మొదటి వ్యక్తి కి ఈవిధంగా వినిపించింది. “నీ స్నేహితుడిని ద్వీపంలో విడిచిపెట్టి ఎందుకు వెళుతున్నావు?” అని. “నాకు లభించిన ఆశీస్సులు నాకు మటుకే స్వంతం. ఎందుకంటే నేనే వాటికోసం ప్రార్ధించాను కనుక “అన్నామొదటివ్యక్తి.”అతని ప్రార్ధన లేవీ అంగీకరింపబడలేదు. అందువల్ల అతనికి ఆశీస్సులు పొందే అర్హత లేదు.” అన్నాడు. ఆకాశవాణి ఆ మొదటివ్యక్తిని మందలిస్తూ “నీవు పొరపడ్డావు.అతడు ఒకే ఒక కోరిక కోరాడు. నేను అతనిని వెంటనే అనుగ్రహించాను. ఆ వరమే కనుక నేను అతనిని ఇచ్చి ఉండకపోతే నీకు అసలు నా ఆశీస్సులు లభించిఉండేవి కాదు “అన్నది.
“అతను దేని కోసం ప్రార్ధించాడు? అతనికి నేను ఎందుకు ఋణపడి ఉండాలి?” అని మొదటివ్యక్తి ఆకాశవాణిని ప్రశ్నిచాడు. “నీ ప్రార్ధనలన్నీ ఫలించాలని అతను నన్ను ప్రార్ధించాడు.” అన్నది ఆకాశవాణి.

నీతి: మనకి లభించిన అనుగ్రహమంతా కేవలం మన ప్రార్ధనల ఫలితం న మాత్ర మే కాదని, ఇతరులు కూడా మనకోసం ప్రార్ధించటం వలననే ఇది సాధ్యమనీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనకోసం ఇతరులు చేసే ప్రార్ధనల వలన కూడా మనకి భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి. స్నేహితులకు విలువనివ్వాలి. ప్రేమించిన వారిని ఏప్పుడూ దూరం చేసుకోకూడదు.

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s