బ్రాహ్మణి –ముంగిస, విలువ:ధర్మప్రవర్తన,అంతర్గత విలువ:విచక్షణ

panchatantra-brahmani-mongoose_05

ఒకానొక నగరంలో ఒక బ్రాహ్మణుడు తన భార్యతో నివసిస్తూ ఉండేవాడు. బ్రాహ్మణుడి భార్య ఒక మగపిల్లవాడిని ప్రసవించింది. అదే సమయంలో ఒక ముంగిస కూడా మగముంగిసకు జన్మనిచ్చింది. బ్రాహ్మణుడి భార్య (బ్రాహ్మణి) ముంగిస బిడ్డని దత్తత తీసుకుని తన కొడుకుతో సమానంగా పెంచసాగింది. ముంగిస స్వభావాన్ని బట్టి అది ఎప్పుడైనా తన కుమారుడికి అపాయం కలిగించవచ్చుననే భయంతో బ్రాహ్మణి తన కొడుకుని ముంగిసతో ఎప్పుడూ ఒంటరిగా వదిలేది కాదు. ఎంత అందవికారి, మూర్ఖుడు, క్రూరుడు ఎలాంటివాడయినప్పటికి తల్లితండ్రులకి తమ బిడ్డ ముద్దుగానే అనిపిస్తాడు.
ఒకరోజు చెరువునుంచి నీళ్ళు తేవటానికి వెళుతూ బ్రాహ్మణి తన పిల్లవాడిని భర్తకి అప్పగించి, కనిపెట్టి ఉండమని చెప్పింది. ఇంతలో ఒక త్రాచు పాము ఇంట్లోకి ప్రవేసించింది. బ్రాహ్మణుడి పిల్లవాడికి త్రాచుపాము నుండి అపాయం కలగకుండా ముంగిస ఆ పాముని చంపేసింది. తన పెంపుడు తల్లి బ్రాహ్మణి అడుగుల శబ్దం విన్న ముంగిస పిల్లవాడినికాపాడానన్న ఆనందంతో, నెత్తురు కారుతున్న మూతితో ఎదురు వెళ్ళింది. రక్తం కారుతున్న మూతితో ఉన్న ముంగిసని చూడగానే బ్రాహ్మణి తన కుమారుడిని ముంగిస చంపేసిందన్న అనుమానంతో ఇంకేమీ రెండవ ఆలోచన లేకుండా తన చేతిలోని కుండలో ఉన్న నీళ్ళను ఆ ముంగిసపైన కుమ్మరించింది. తక్షణమే ఆ ముంగిస చనిపోయింది.
ముంగిస మరణానికి బాధపడుతూనే బ్రాహ్మణి లోపలికి వచ్చి తన కుమారుడు ఉయ్యాలలో ఆదమరచి నిదురపోతుండటం, ఉయ్యాల పక్కన ముంగిసచే కొరకబడి మరణించిన త్రాచుపాము ముక్కలని చూసింది. అంతవరకు కన్నకొడుకుతో సమానంగా పెంచుకున్న ముంగిసను అనాలోచితంగా చంపివేసినందుకు బ్రాహ్మణి దుఃఖంతో క్రుంగిపోయింది.

నీతి: విచక్షణ జ్ఞానం ఉపయోగించకుండా తొందరపాటుగా పనులు చేసేవారు బ్రాహ్మణుడి భార్యలాగా విచారించ వలసివస్తుందని పెద్దలు అంటారు.తొందరపాటుతనం దుర్వినియోగానికి కారణం.ఏపనిని అయినా చేసే ముందు బాగా ఆలోచించి చెయ్యాలి.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

Leave a comment