వినయమునకు గీటురాయి!!!

విలువ: సత్ప్రవర్తన;

అంతర్గత విలువ: వినయము13-SM-P_2-T_M_-_13_1841470e

ఈశ్వర ఛంద్ర విద్యాసాగర్ గొప్ప వినయవిధేయతలు కలిగి ఉండేవారు. ఆయనలోని ఈ లక్షణమే చాలా మందికి స్ఫూర్తిని కలిగించింది. ఆయన జీవితంలోని అనేక సంఘటనలు వారి నిరాడంబరతను, వినయమును ప్రతిబింబిస్తాయి. ఇటువంటి గొప్పలక్షణములు, వారు సమాజమునకు చేసిన సేవ భారతదేశమంతా ఆయన పేరు ప్రఖ్యాతులు గడించేలా, అందరిచేతా గౌరవింపబడేలా చేశాయి.

కలకత్తా విశ్వవిద్యాలయమును స్థాపించటం కోసం ఈశ్వర ఛంద్ర విద్యాసాగర్ కొంతమంది స్నేహితులతో కలిసి విరాళాలు సేకరించే కార్యక్రమం చేపట్టారు.ఆయన తన తోటి మిత్రులు వారిస్తున్నప్పటికీ వినకుండా అయోధ్యనగరం నవాబు దగ్గరికి విరాళం కోసం వెళ్ళారు. నవాబు దయాధర్మములు లేనివాడు కావటం వలన ఈశ్వర ఛంద్ర విద్యాసాగర్ తమ లక్ష్యమును గురించి వివరంగా చెప్పినప్పటికీ నవాబు ఎంతో అమర్యాదగా విద్యాసాగర్ గారిని కించపరిచేవిధంగా ఆయన జోలెలో తన చెప్పులు వేశాడు విరాళంగా. విద్యాసాగర్ గారు నవాబుని ఏమీ అనకుండా మౌనంగా బయటికి వచ్చేశారు అక్కడినుండి.

మరునాడు నవాబు అంతఃపురమునకు ఎదురుకుండా నవాబు చెప్పులను వేలం వేశారు. నవాబు మెప్పు పొందటం కోసం ఆయన దగ్గర పనిచేసే జాగీర్దారులు, సభికులు అందరూ వేలం పాటకి హాజరయ్యారు. చెప్పులు వేలంపాటలో వెయ్యి రూపాయలకు అమ్ముడు పోయాయి. ఈ వార్తని విని ఆనందించిన నవాబు అంతే మొత్తాన్ని తానుకూడా విరాళంగా ఇచ్చాడు.

నవాబు తన జోలెలో చెప్పులు విరాళంగా వేసినప్పుడు విద్యసాగర్ వేరొకరకంగా స్పందించి ఉండవచ్చును. అది ఒక అవమానంగా భావించి బాధపడి ఉండవచ్చును. కాని, ఆయన తన లక్ష్య సాధనలో దీనిని ఒక అవకాశంగా స్వీకరించారు. వేలంపాట ద్వారా ధనం పొందటమే కాకుండా నవాబును కూడా ఆనందింపచేయగలిగారు. ఆయన తన వ్యక్తిగత భావోద్వేగములకు ప్రాముఖ్యం ఇవ్వకుండా తన లక్ష్య సాధనకే ముందుకు సాగారు. చివరికి ఆయన కృషి, ఆశయం ఫలించి ఆయన చిరకాల స్వప్నమైన కలకత్తా విశ్వ విద్యాలయం స్థాపించబడింది.

నీతి: ఏదైనా వ్యతిరేక పరిస్థితి ఎదురైనప్పుడు దానికి వెంటనే ప్రతిస్పందించటం కాకుండా తగిన విధంగా స్పందించే ప్రయత్నం చెయ్యాలి. ఇటువంటి పరిస్థితిలో ఏ విధంగా స్పందించాలి? తమ ఇష్టాఇష్టములను పక్కన పెట్టి జీవితంలో సాధించదలచిన ఉన్నత ఆశయం కోసం పాటుపడాలి. ఈశ్వర ఛంద్ర విద్యాసాగర్ గారి లాగా వ్యక్తిగత భావోద్వేగములను అదుపులో ఉంచుకున్నప్పుడు మనం అనుకున్న లక్ష్యములను సాధించి విజయం పొందగలుగుతాము. వినయం అనేది ,అంత చక్కని సుగుణము.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s