పసితనంలోనే పిల్లలకు మానవతా విలువలను నేర్పాలి!! విలువ:ధర్మము ,అంతర్గత విలువ: సత్ప్రవర్తన

class

   మేము నివసించే ఊరిలో ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం సాయంకాలం చిన్న పిల్లలకి విలువలతో కూడిన నీతిబోధలను క్రమం తప్పకుండా బోధిస్తూ ఉంటాను. ఇలా పిల్లలకి బోధించటం ఎంతో ఆనందమును కలిగించటమే కాకుండా వాళ్ళతో మాట్లాడే సమయంలో, చర్చలలో ఎన్నో విషయాలను నేర్చుకునే అవకాశం నాకు కూడా లభిస్తూ ఉంటుంది.

           2014వ సంవత్సరం, మార్చి 14వ తేదీన శుక్రవారం నాడు మా ఇంట్లో నాలుగు నుంచి ఆరు సంవత్సరములలోపు వయసుకల పిల్లలకి పాఠం చెప్పబోతున్నాను.సరిగ్గా సాయంత్రం 5గం 30నిముషాలకు ఆరు సంవత్సరముల వయస్సుకల  ఒక చిన్న పాప నేను పాఠాలు చెపుతుంటే , మా ఇంటిలోని దేవుడి గదిలోనికి వచ్చింది. చుట్టూ  పరిశీలనగా చూస్తూ, పెదవులపై చిరునవ్వుతో ఆ పాప నాతో “ఇక్కడ నాకు దేవుడు ఉన్నట్లుగా సువాసన వస్తున్నది” అన్నది. ఆ పాప మాటలు నాకు చాలా ఆశ్చర్యమును కలిగించాయి. ఇక్కడ ఏదో వినూత్నంగా,మంచిగా ఆ పాపకి అనిపించినట్లు ఆమె హావభావముల వలన తెలుస్తున్నది. 

పసిపిల్లలు ఎంతో అమాయకంగా, పవిత్రంగా ఉంటారు. ఆ పవిత్రతని, అమాయకత్వాన్ని మన పెద్దలం కూడా నిలుపుకోగలిగితే ఎంత బాగుంటుంది!

                పాఠం చెప్పటం ప్రారంభించిన తరువాత ఒక ఐదేళ్ళ పాప మరొక ఆరేళ్ళ పాప గురించి ఒక నేరం చెప్పింది. ఈ ఐదేళ్ళ పాపకి ఆడుకునే మైదానంలో ఒక దువ్వెన దొరికింది. అది ఆ ఆరెళ్ళ పాపకి ఇస్తే ఆ పాప ఈ పాపకి బదులుగా ఒక బుహుమానం ఇస్తానని చెప్పి ఇవ్వలేదుట. తాను బదులుగా బహుమానం ఎందుకు ఇవ్వలేదో చెప్పటానికి ఆ ఆరేళ్ళ పాప ప్రయత్నిస్తున్నది.

             ఇప్పుడు, వాళ్ళు చెప్పినది విన్న తరవాత చెప్పటం ఇకనావంతు. అసలు మైదానంలో దువ్వెన కనబడినప్పుడు తమది కాని వస్తువును తీసుకోవటం మొదటి తప్పని వాళ్ళకి చెప్పాను. తమకి చెందని వస్తువులను ఎన్నడూ, అది ఏ వస్తువు అయినప్పటికీ తీసుకో కూడదని చెప్పాను. మానవతా విలువలైన నిజాయితీ, సత్ప్రవర్తనలను ఇప్పటినుంచే అలవాటు చేసుకోవాలని చెప్పాను. ఇకముందు ఎప్పుడైనా , ఏదైనా వస్తువు వాళ్ళకి దొరికితే అది వెంటనే అక్కడ ఉండే కాపలాదారుకి ఇచ్చేస్తే అతను ఆ వస్తువును స్వంతదారుకు చేరుస్తాడని చెప్పాను.

              పాఠం ముగించబోతుండగా ఆ ఐదేళ్ళ పాప ఆరేళ్ళ పాపతో అంటున్న మాటలు నా చెవిన పడ్డాయి. ఇంటికి వెళ్ళగానే ముందుగా ఒంటరిగా కాని, ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళి ఆ దువ్వెనని కాపలాదారుకి ఇచ్చేస్తానని చెప్పింది. అంత త్వరగా ఆ పాప సానుకూలంగా స్పందిచటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. చెప్పిన నీతి , వాళ్ళ బుర్రలోకి అక్కడే అప్పుడే ఎక్కింది. 

            చిన్న పిల్లల స్వభావం అలాగే ఉంటుంది. వాళ్ళకి ఏది చెప్పినా వాళ్ళు వెంటనే వంట పట్టించుకుంటారు. వాళ్ళు “స్పాంజి” లాంటి వాళ్ళు. అందువల్ల చిన్నతనంలోనే వాళ్ళకి నైతిక విలువలు, చక్కని అలవాట్లు మొదలైనవి తల్లితండ్రులు, ఉపాధ్యాయులు నేర్పించాలి. మొక్కై వంగనిది మానై వంగదు కదా! మన పిల్లలకి చిన్నతనం నుంచి మంచి నీతులు, నడవడి నేర్పించి, ప్రపంచమునకే ఆదర్శవంతులైన పౌరులుగా తయారుచెయ్యాలి. నాకెప్పుడూ అంత తృప్తిగా, అంత అర్ధవంతంగా గతంలో ఎన్నడూ అనిపించలేదు.

           పిల్లలకి ఇలా మానవతావిలువలతో కూడిన, అర్థవంతమైన పాఠాలను బోధించగలగటంలో కలిగిన తృప్తి  ఇంతకుముందు ఎన్నడూ కలుగలేదు. ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. నిజంగా ఈ విధమైన విలువలతో కూడిన విద్యను పిల్లలకి బోధించే అవకాశం నాకు లభించటం, వారిలో చక్కని ఎదుగుదలను, మార్పును చూడగలగటం నాకు లభించిన అదృష్టంగా భావిస్తున్నాను.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s