మొసలి – పూజారి !!! విలువ: సత్యం;అంతర్గత విలువ: అంతటా, అన్నింటా ఏకత్వాన్ని ప్రదర్శించాలి.

ఒకప్పుడు ఒక మొసలి ఉండేది. ప్రతిరోజూ ఉదయం ఈ మొసలి చాలా విచిత్రంగా ప్రవర్తించేది. సాధారణంగా ఇతర మొసళ్ళు ఏవీ చెయ్యని పనులను ఈ మొసలి చేస్తుండేది. రొజూ సూర్యోదయానికి ముందే ఈ మొసలి నిద్ర లేచేది. ఎంతో విశ్వాసం తో సాధన చేసేది. సాధన అంటే ఏమితో మీకు తెలుసా?

సాధన అంటే ఆధ్యాత్మిక సాధన. ప్రతి రోజూ భగవంతుడిని తలుచుకోవటం కోసం ఏదైన చెయ్యటం. భగవంతుడిని తలుచు కోవటం కోసం మీరు ఏమి చేస్తారు?

ఈ మొసలి చాలా తెలివైనది. సూర్యూదయానికి ముందు కాలం భగవంతుడిని తలుచుకోవటానికి చాలా ఉత్తమమైన కాలం అని ఆ మొసలికి తెలుసు. అందువల్ల సూర్యుడు ఉదయించటానికి ముందే లేచేది. ఆ తరువాత హృదయపూర్వకంగా భగంతుడి నామాన్ని తలుచుకుంటూ ప్రార్ధన చేసేది. ప్రతి రోజునూ తన ప్రార్ధనతో ప్రారంభించేది. సాధన తరువాత తన శరీరానికి మంచి శక్తిని ఇచ్చే ఆహారాన్ని తినేది. ఒక రోజున అక్కడికి ప్రఖ్యాతి గాంచిన ఒక పూజారి వచ్చాడు.

మొసలి చేస్తున్న సాధన చూసిన పూజారి “ఓ మొసలి… నువ్వు ఏమి చేస్తున్నావు? నువ్వొక జంతువువి అయినా రోజూ నీవు నామాన్ని స్మరిస్తూ ప్రార్ధన చేస్తున్నావు ఎందుకు? ఏమిటి ప్రయొజనం? “అని మొసలిని అడిగాడు.”నిజమే! నేను జంతువునే… కానీ, నాకు భగవదనుభవం పొందాలని ఉన్నది. అందుకే ప్రతిరోజూ సాధన చేస్తున్నాను అన్నది మొసలి. “కాని అందువల్ల ఉపయోగం లేదు” అన్నడు పూజారి. “ఎందుకు లేదు” అడిగింది మొసలి. అప్పుడు పూజారి మొసలితో “నీవు భగవంతుడిని పొందలేవు. నువ్వు కేవలం ఒక మొసలివి.మళ్ళీ మనుష్య జన్మ లభించేవరకు వేచి ఉండాలిసిందే!” అన్నాడు.

download (6)

మొసలి ఎంతో ధైర్యంగా బదులు చెప్పింది.” వావ్…. నీవు చాలా మూర్ఖుడివి అనిపిస్తోంది. నీవు పూజారిగా కనిపిస్తున్నావు కాని నీకు కనీసం మామూలు విషయాలు కూడా తెలియవు. నిన్నుసృష్టించిన దేవుడే నన్ను కూడా సృష్టించాడు!” ఈ మొసలి ఎంత తెలివైనది అని పూజారి ఆశ్చర్యపడ్డాడు.

మొసలి ఇంకా ఇలా అన్నది.”ప్రతిరోజూ నేను దేవుడిని తలుస్తూ ధ్యానం చేస్తే నాకు భగవంతుడిని పొందే అవకాశం ఉన్నది కానీ, నువ్వు ఏ సాధన చెయ్యంకుండా ఉంటే నీకు అసలు అవకాశమే ఉండదు! నిజానికి మరుజన్మలో నీవు మొసలిగా పుట్టవలసి వస్తుంది.”

“నేను మొసలిగా పుట్టటమా! నీకు ఇలాంటీ పిచ్చి ఆలోచన ఎలా వచ్చింది?” అన్నాడు పూజారి. ఇంతలో ఆశ్చర్యంగా తక్షణమే ఆ పూజారి ఒక మొసలిగా మారిపోయాడు. ఇప్పుడు రెండు మొసళ్ళు పక్క పక్కనే కూర్చుని ఉన్నాయి.

మొసలి పూజారిని అడిగింది “అయితే ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తున్నది?” పూజారికి అంతా అయోమయంగా ఉన్నది.

“నేను మొసలిగా మారతానని నీకు ఎలా తెలుసు? అని పూజారి అడిగాడు. మొసలి చాలా తెలివైనది. అది పూజారితో “నేను మొసలిగా ఉన్నా పవిత్రంగా జీవిస్తూ సాధన చేస్తున్నాను. నువ్వు పూజారిగా ఉన్నా మొసలిలాగ ప్రవర్తిస్తున్నావు.” అన్నది.

చూడండి – తాను మొసలి కంటే ఉన్నతమని భావించాడు పూజారి. కాని, మనమందరం ఒక్క భవంతునిచే సృష్టిచేయబడ్డవాళ్ళమే.  మీరు ఎవరైనా, ఏదైనా ఇతరుల కంటే మీరు ఎక్కువని భావించవద్దు. ఎంత ఉత్తమంగా జీవితాన్ని గడపగలరో అలా గడిపేందుకు ప్రయత్నం చెయ్యండి.

నీతి: “సత్యం ఉన్నతమైనది కాని, సత్యంగా జీవించగలగటం మరింత ఉన్నతమైనది.” –గురునానక్

ప్రతిరోజూ సాధన, నిత్యం చేసే ధ్యానం సత్యంగా జీవించటానికి ఉపయొగపడతాయి. తరగతిలో నీకంటే బలహీనులు కాని,నీకంటే తక్కువ అని నీవు భావిస్తున్నవారు కాని అందరూ నీలాగె భగవంతుడి చేత సృష్టించబడినవారే.

గాఢంగా శ్వాస తీసుకుంటూ “మనమంతా ఒక్కటే” అని తలుచుకోండి.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s