తోటలో మొక్కలు; అడవిలో చెట్లు, విలువ: ధర్మం, అంతర్గత విలువ: విధి నిర్వహణ

అక్బర్ బాద్ షా  తన ఇష్టమైన మంత్రి బీర్బల్ తో  ఒక నాడు షికారుకు బయలుదేరాడు. దారిలో ఒక ఆటవిక స్త్రీ చెట్టుకింద కూర్చుని ఆయాస పడడం చూసారు.

కొంత సేపటికి తిరిగి కోట వైపు వెళ్తుంటే ఆ స్త్రీ ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డని గుడ్డల్లో చుట్టి, ప్రసవమైన ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి, తన దారిని చక చక బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది.

ఇది చూసిన అక్బర్ బాద్ షా బిడ్డను ప్రసవించడం అంత సునాయసమని అపోహ పడ్డారు.

ఇంటికి వచ్చి, గర్భవతి ఐన తన బేగంకి పరిచారకులు అవసరంలేదని, తన పనులు తనే చేసుకోవాలని చెప్పి, వాళ్ళను వేరే పనులు చేసుకోమని మళ్ళించారు.

నిండు గర్భవతి ఐన బేగం తన పనులు చేసుకోవటం అలవాటు లేక, చాలా ఇబ్బంది పడసాగింది.

తట్టుకోలేక ఒక రోజు బీర్బల్ను సహాయం అర్థించింది.

బీర్బల్ ఇంత నాజూకైన విషయం అక్బర్ బాద్ షా తో ఎలా  చెప్పాలని సతమతమయ్యాడు.

అలోచించగా ఒక ఉపాయం తట్టింది.

కోట లోని తోటమాలిని కొద్ది రోజులు మొక్కలకి నీళ్ళు పోయవద్దని చెప్పాడు.

రోజు తోటలో విహరించడం అలవాటైన అక్బర్ ఒక రోజు అలాగే తోటలో వుండగా మొక్కలు నీరసించి వాడిపోతూ వుండడం గమనించాడు. వెంటనే తోట మాలిని విషయం చెప్పమని ఆగ్రహించాడు.

birbal-garden-plants

తోట మాలి బీర్బల్ ఆదేశానుసారం మొక్కలకు నీళ్ళు పోయటంలేదని చెప్పాడు.

కోపంతో అక్బర్ బీర్బల్ను పిలిపించాడు. “మొక్కలు నీళ్ళు లేకపోతే ఎండిపోవా?” అని కోపంతో కేకలు వేయ సాగాడు.

బీర్బల్ అప్పుడు నిదానంగా, “బాద్ షా! అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు ఏ తోట మాలి సహాయం లేకుండా, రోజు నీళ్ళు పోయకుండ, పెరిగాయి కదా? అలాగే మరి మన కోటలో తోటలకి ఇంత మంది సేవకులు ఎందుకు?” అన్నాడు.

వెంటనే అక్బరుకు జ్ఞానోదయమయ్యింది. బీర్బల్ సున్నితంగా ఇచ్చిన సూచనను గ్రహించి వెంటనే రాణి గారికి పరిచారకులను పురమాయించాడు.

నీతి: భగవంతుడి సృష్టిలో ఒకో జీవికి ఒకో ప్రత్యేకత ఉంటుంది. తమ సంప్రదాయాలు, ఆచారాలు గౌరవిస్తూ తమ విధులు నిర్వర్తించాలి కాని సమాజంలో మిగిలిన వర్గాల వారితో పోల్చుకుని తమ పద్ధతులు మార్చుకోవాలని ప్రయత్నించకూడడు.

https://saibalsanskaar.wordpress.com/

https://www.facebook.com/neetikathalu

 

Bottom of Form

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s