ఒక విలువైన శాలువా!! విలువ:ధర్మాచరణ,ఉపవిలువ:విచక్షణ

download (5)

ఒకానొకప్పుడు అత్యంత విలాశ జీవితము ,ఇంద్రియ సుఖములయందు అత్యంత ఆశక్తి కల ఒక రాజు   ఉండేవాడు . విపరీతంగా మధ్యము సేవించటం,ఇంద్రియ సుఖాలలో మునిగి తేలటం  ,ఇంకా అనేక ఇతర వ్యసనాలకు బానిసగా జీవిస్తూ ఉండేవాడు .ఆ రాజు తన ప్రధాన మంత్రి తో “మనిషి జన్మ లభించటం అంత సులభమైన విషయం కాదు.అందువల్ల వీలైనంత లౌకిక సుఖాలను ,ఇంద్రియ సుఖాలను అనుభవించే ప్రయత్నం చెయ్యాలి.  జీవితంలోని ఆనందాలన్నీ పూర్తిగా అనుభవించేవిధంగా కాలాన్ని గడపాలి “అని చెబుతూ ఉండేవాడు.

ప్రధానమంత్రి చాలా  తెలివైన గౌరవనీయమైన వ్యక్తి. రాజు యొక్క ఈ విలాశ జీవితం ,అతని అలోచనా విధానం ప్రధానమంత్రికి చాలా బాధ కలిగిస్తూ ఉండేది.అవకాశ దొరికినప్పుడల్లా రాజుకి తగిన సలహా ఇవ్వటానికి ప్రధానమంత్రి ప్రయత్నిస్తూ ఉండేవాడు .కానీ రాజు యే మాత్రం అర్ధం చేసుకునే వాడు కాదు .ప్రధాన మంత్రి సలహా వినే వాడు కాదు .భోగలాలలస తో కలుషితమైన తన మనసు  తప్పు ఎదో ఒప్పు ఎదో గుర్తించలేక తన మనసు ప్రజలను తప్పు త్రోవ పట్టిస్తూ ఉండేది . అతని పరిపాలనలో ప్రజలు భయం తొ బ్రతుకుతూ ఉండేవారు.రాజు చాల దుర్మార్గుడు కావటం వలన ఎవ్వరూ అతన్ని ఎదిరించే సాహసం చేసే వారు కాదు.

ఒక రోజున ప్రధాన మంత్రి చేసిన ఒక పని రాజుకి  చాలా ఆనందాన్ని కలిగించింది .అందుకు బహుమానంగా రాజు మంత్రికి ఒక ఖరీదైన ,విలువైన శాలువాను బహూకరించాడు .ప్రధానమంత్రి పట్ల అసూయ కలిగిన ఒక సభికుడు , మంత్రి ,రాజు గారు ఇచ్చిన ఖరీదైన శాలువా తో ముక్కు తుడుచుకోవటం గమనించాడు . అతను వెంటనే రాజు గారి దెగ్గరికి వెళ్ళి “మహారాజా !ఈ రొజు ప్రధాన మంత్రి మీ గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించారు. “ఏమి జరిగింది?” ,అని అడిగాడు రాజు . “మహారాజా!  మీరు బహూకరించిన  అత్యంత ఖరీదైన శాలువాను ముక్కు చీదుకోటానికి ఉపయోనించాడు “అని చెప్పాడు ఆ సభికుడు.

మహారాజు వెంటనే ప్రధానమంత్రిని పిలిపించాడు .”నేను బహూకరించిన ఖరీదైన శాలువా తో ముక్కు చీదుకోవటానికి నీకు ఎంత ధైర్యం ?” అని ప్రశ్నించాడు .ప్రధాన మంత్రి దానికి ఎంతో గౌరవంగా “ప్రభూ !మీరు నేర్పిన విధంగానే నేను ప్రవర్తించాను!” అన్నాడు . “అగౌరవంగా ప్రవర్తించమని నేను నెర్పించానా ? యే విధంగా ?”,అని అడిగాడు మహా రాజు “ఈ శాలువా కంటే ఎంతో విలువైన జీవితాన్ని ,భగవంతుడు మీకు ప్రసాదించాడు .అంత విలువైన జీవితాన్ని మీరు యే మాత్రం గౌరవం,నీతి నియమాలు లేకుండా  ఇంద్రియ సుఖాలకోసం  ,లౌకిక మైన ఆనందాల కోసం  ఉపయెగించటం నాకు  ఇలా శాలువాను దుర్వినియోగం చేయటం నేర్పింది.. ” అని ఎంతో వినయంగా బదులు ఇచాడు ప్రధాన మంత్రి. ఈ విధంగా ప్రధానమంత్రి యుక్తి ఫలంచింది! రాజు తన తప్పుని గ్రహించాడు  .ఆ క్షణం నించి మహారాజు జీవన విధానం ,రాజ్యపాలనా విధానం పూర్తిగా మంచిగా మారిపోయింది.

నీతి: మంచి చెడుల మధ్య భేదాన్ని గుర్తించాలి ! చిన్నతనంలోనే ఇటువంటి విషయాలు నేర్పితే , పిల్లలు మేధావుల లాగా ఎదిగి ధర్మభద్దమైన జీవితాన్ని గడుపుతారు.

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s