దివ్యత్వము మరియు అహంకారం ! విలువ: ధర్మము;అంతర్గత విలువ: అహంకారానికి తావు ఇవ్వకుండా అన్నిటిలో దైవత్వాన్ని చూడగలగటం.

image

అనగనగా ఉత్తంగుడనే ఋషి ఉండేవాడు. ఆయన లోకకల్యాణం కోసం దీక్షగా ఎన్నో సంవత్సరములు తపస్సు చేసారు. జన్మరీత్యా అతడు బ్రాహ్మణుడు, కృష్ణ భక్తుడు. ఉత్తంగుడు కామ,క్రోధ,లోభ,మోహ,మద మాత్సర్యములనే దుర్గుణాల టా కి తావు ఇవ్వకుండా , ఎంతో సాధారణమైన జీవితాన్ని గడు పుతూ తన లోకంలో తాను నిముఘ్నుడై ఉండేవాడు.
అతని తపస్సుకి మెచ్చి శ్రీ కృష్ణుడు తన విశ్వ విరాట్ స్వరూపాన్ని చూపి అనుగ్రహించడమే కాక ఏదన్నా వరం కోరుకొమ్మని ఎంతో ప్రేమగా అడుగుతాడు. అయితే ఏ కోరికా లేని ఉత్తంగుడు, ఎంతో ప్రేమని కురిపిస్తున్న తన ఇష్టదైవాన్ని కాదనలేక ఒక చిన్న కోరికని కోరతాడు. అదేమిటంటే, తనకి దాహం వేసి నీరు త్రాగాలి అనుకున్నప్పుడల్లా తనకి ఎప్పుడైనా, ఎక్కడైనా తాగడానికి నీరు దొరకాలి ,అని!
ఒక రోజు ఉత్తంగ ముని యడారిలో నడుస్తుండగా అతనికి బాగా దాహం వేసింది. ఏక్కడా ఒక నీటి చుక్క కూడా అతనికి కనిపించలేదు. ఉత్తంగుడికి ,శ్రీ కృష్ణుడు అనుగ్రహించిన వరం గుర్తుకొస్తుంది. అలా, ఆ వరం గుర్తుకి రాగానే అతడికి చిరిగిన బట్టలు వేసుకున్న ఒక వేటగాడు కనిపిస్తాడు. అతని తో, ఒక కోపం గా చూస్తున్న కుక్క ..మరియు చేతిలో ఒక నీళ్ళు నిండి ఉన్న లేదెర్ పర్సు ఉంది.అతడి వాలకం చూసిన ఈ బ్రాహ్మణుడికి అసహ్యం కలిగింది. దానితో ఆ వేటగాడు తనకి త్రాగటానికి నీరు ఇవ్వబోతే మొహం మీద “నాకు వద్దు… అడిగినందుకు నేను కృతజ్ఞుడిని అని మాట దాటేస్తాడు”. అయినా కూడా అంత దాహంతో అలమటిస్తున్న ఉత్తంగమునిని ఇంకోసారి నీరు త్రాగమని అర్ధిస్తాడు ఆ వేటగాడు .దాంతో ఇంకా కోపం ఎక్కువైన ఉత్తంగుడు ఆ వేటగాడిని తను ఉన్న చోటునించి తరిమేస్తాడు.
అన్ని సార్లు వద్దన్నాక వేటగాడు కుక్కతో పాటు అక్కడ నించి మాయం అయిపోతాడు. కొద్దిసేపటికి ఉత్తంగుడికి ఒకవేళ భగవంతుడే వేటగాడి రూపంలో వచ్చాడేమో అని తడుతుంది. “అయ్యో! ఆ భగవంతుడే నా దాహం తీర్చటానికి వస్తే నాకు తెలియలేదే! ఎంత తప్పు జరిగిపోయింది. అయినా అన్నీ తెలిసిన కృష్ణుడు ,తక్కువ జాతికి చెందీన వాడితో నాకు ఎందుకు నీళ్ళు పంపాలి. బ్రాహ్మణుడైన నేను అతని చేతితో ఇచ్చిన మంచి నీళ్ళని తాగేస్తానని అసలు ఎలా అనుకున్నాడు! అని తనలో తానే ఇలా బాధ పడుతున్నాడు.”
ఇంతలో శ్రీ కృష్ణుడు చిరునవ్వుతో ప్రత్యక్షమై ,ఉత్తంగుడిని ఇలా ప్రశ్నిస్తున్నాడు “ ఉత్తంగా! ఏవరిని చండాలుడు అంటున్నావు. నేను నీకు మంచినీటిని అందివ్వమని సాక్షాత్ ఇంద్రుడినే పంపాను. దేవేంద్రుడు ,నీళ్ళకి బదులు అమృతాన్నే నీకు ఇద్దామని వచ్చాడు. అయితే నీవు అందరిలో దైవాన్ని చూడగలవో లేదో అని చిన్న పరీక్ష పెట్టాము! ఇది విన్న ఉత్తంగుడు భగవంతుడు తనకి పెట్టిన పరీక్షలో ఓడిపోయానని తెలుసుకుంటాడు. కేవలం తన అహంకారంవల్ల అమృతాన్ని తెచ్చిన ఇంద్రుడిని గుర్తుపట్ట లేకపోయానని గ్రహిస్తాడు.ఉత్తంగుడు లాంటి గొప్ప ముని ఇలా అహంకారానికి గురి అయితే ..మనమెంత.
భగవంతుడి లీలలని, మాయని తెలుసుకోగలిగే సమర్ధత మనకి ఉన్నదా! అలా అందరిలో దివ్యత్వాన్ని చూడగలగాలి అంటే ప్రతిక్షణం జాగ్రత్తగా సావధానంగా ఉంటూ, మన జీవిత పరమార్థమేమిటో తెలుసుకోగలగాలి. భగవంతుడు ఎప్పటికప్పుడు మనకి పరీక్ష పెడుతూనే ఉంటాడు. కాని, అవి మన మంచికే. తాను చేసే ఏపని కూడా మనని బాధ పెట్టే ఉద్దేశంతో చేయడు! ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు.
నీతి: మనమంతా ఒక్కటే. అందరం ఆ భగవంతుడి ప్రతిరూపాలమే. ఈ సత్యాన్ని ప్రతి క్షణం గుర్తుపెట్టుకుంటే మనం అందరిలో భగవంతుడిని చూడగలిగి అంతటా దివ్యత్వాన్ని అనుభవిస్తూ ఆనందంగా ఉండగలుగుతాము.

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s