మానవత్వాన్ని గెలిపించిన పరుగు పందెం!!!విలువ :ధర్మము ;అంతర్గత విలువ:పరుల పట్ల సానుభూతి

stock-vector-two-athletes-are-performing-a-relay-race-13577287

ఇది ఒక యువ క్రీడాకారుని కథ!!! అతడు ఎప్పుడూ గెలుపుకే ప్రాధాన్యత ఇచ్చేవాడు. అతనికి విజయం అంటే గెలుపొక్కటే. ఒక సారి తన ఊరిలోనే ఇద్దరు తోటి యువకులతో పరుగు పందెం లో పాల్గొంటాడు. ఈ పరుగు పందాన్ని చూడటానికి, జనాలు గుంపులుగా వస్తారు.అందులో ఒక అనుభవఘ్ఙుడైన పెద్దమనిషి కూడా ఈ క్రీడాకారుని పేరు ప్రఖ్యాతులు విని అతను పాలుగొనబోయే ఆ యొక్క పందాన్ని కళ్ళారా చూడటానికి వస్తాడు.

పందెం మొదలు అయింది, మన క్రీడాకారుడు ఎంతో ఉత్సాహంగా, గట్టి పట్టుదలతో, ధైర్య సాహసాలతో పరుగులో ఎలాగైనా అందరి కంటే ముందు రావాలని కాలు దువ్వాడు. అనుకున్న విధంగానే పందెం మొదటి స్థానంలో గెలిచాడు. ఆట చూడటానికి వచ్చిన ప్రేక్షకులంతా అతని గెలుపుకి చప్పట్లతో, చేతులు ఊపుతూ వారి ఆనందాన్ని వ్యక్తం చే శారు. కానీ ఈ పెద్దమనిషి మటుకు స్థబ్దుగా ఏ స్పందనా లేకుండా కూర్చుని చూస్తున్నాడు. కానీ గెలిచిన మన క్రీడాకారుడు మటుకు చాలా గొప్పగా, ధీమాతో నిలబడి అందరినీ చూస్తున్నాడు.

సరే, రెండో సారి పందెం నిర్వహిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఇతడిని ఎలాగైనా గెలవాలని ఉత్సాహంతో ఇద్దరు సమర్థవంతులైన క్రీడాకారులు ముందుకి వచ్చారు. ఈసారి కూడా మన క్రీడాకారుడు మొదటి స్థానంలో పరుగు పందాన్ని గెలుస్తాడు. మళ్ళీ పందాన్ని వీక్షించిన ప్రేక్షకులు హర్షధ్వానాలతో వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ గెలిచిన క్రీడాకారుని ప్రొత్సహిస్తారు. మళ్లీ గెలిచినందుకు క్రీడాకారుడు ఏదో చాలా గొప్పవాడై పోయినట్టు సంబర పడిపోతున్నాడు.

ఇంక తనని ఎవ్వరూ ఓడించలేరన్న ధీమాతో ఇంకొక సారి పందాన్ని నిర్వహించమని అర్ధిస్తాడు. ఇప్పటివరకు చాలా ప్రశాంతంగా, మౌనంగా కూర్చుని ఉన్న మన పెద్దమనిషి ముందుకి వచ్చి ఇద్దరు కొత్త క్రీడాకారులని ,ఈసారి జరగబోయే మూడవ పందంలో పాల్గొనటానికి అక్కడ ఉన్నవారికి పరిచయం చేస్తాడు. అయితే విశేషమేమిటంటే ఈ సారి వరుసగా రెండుసార్లు తెగ సంబరపడిపోతున్న మన క్రీడకారుడి తో పోటీ చేయటానికి ఒక గుడ్డి వాడు, ఇంకో బక్కగా చిక్కిపోయి ఉన్న ఒక ముసిలి ఆవిడ ముందుకి వచ్చారు.వారిని చూసి ఆశ్చర్యపోయిన మన వీరుడు ఇదెక్కడి పందెం, ఇది సాధ్యమేనా అని నిలదీసి ప్రశ్నిస్తాడు. సరే మళ్ళీ ఈసారి కూడా పందెంలో మనవాడే గెలిచి విజయోత్సాహంతో విఱ్ఱవీగుతున్నాడు.కానీ ఎప్పుడూ ఇతడి గెలుపుని చూసి కేరింతలు కొట్టే ప్రెక్షకులు మటుకు ఈసారి మౌనంగా ,ఏ స్పందనా లేకుండా కూర్చుని చూస్తున్నారు.

అరే, వీళ్ళకి ఏమైందసలు అని, మనవాడు ఈ మూడవ పందాన్ని నిర్వహించిన పెద్ద మనిషిని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆయన యువకుడితో, “మళ్ళీ పరిగెట్టండి, ఈసారి మటుకు ముగ్గురూ ఒకేసారి పరుగుని పూర్తి చేయాలి మరి అని ఆదేశిస్తాడు.అప్పుడు మనవాడు కొంచెం నిదానంగా ఆలోచించి, తన తోటి క్రీడాకారులు, అదే గుడ్డివాడు మరియు ఆ ముసిలి ఆవిడ మధ్యలో నించుని, వారిద్దరి చేయి పట్టుకుని మరీ పరుగెడతాడు. వారివురితో సమానంగా అతడు నిదానంగా నడిచి, పరిగెట్టకుండానే పందాన్ని ఒకేసారి పూర్తి చేస్తాడు. ఎన్నడూ కనీ వినీ ఎరగని ఈ విచిత్ర పరుగు పందాన్ని చూసిన అక్కడి ప్రేక్షకులు ఉర్రూతలూగుతారు.

ఈసారి గెలుపుని మటుకు ఆ పెద్దమనిషి మనస్పూర్తిగా అంగీకరిస్తాడు. అది చూసిన ఆ యువ క్రీడాకారుడు తన విజయానికి గర్వపడతాడు.  కానీ! అతనికి ఒక సందేహం కలుగుతుంది, అదేమిటి అంటే “అక్కడి జనాలు అభినందించేది తననా లేక తనతో పోటీలో పాల్గొనిన తన తోటి క్రీడాకారులనా అని!” తన సందేహాన్ని తీర్చమని అడిగితే అప్పుడు ఆ పెద్దమనిషి అతడి కళ్ళలో సూటిగా చూస్తూ, అతడి భుజాలపై చేతులు వేసి “నాయనా! ఇప్పుడు జరిగిన మూడవ పందేంలో ముందు జరిగిన పందాలలో సాధించిన విజయం కంటే చాలా గొప్ప విజయాన్ని సాధించావు”, దానికే ఇక్కడి జనమంతా నిన్ను హృదయపుర్వకంగా అభినందిస్తున్నారు.  మానవుడు మాధవుడిగా ఎదగడానికి ప్రేమ, కరుణ వంటి చక్కటి భావాలని పెంచు కోవాలి.

 

నీతి: గెలవటం ముఖ్యమే, ఆనందమే, కాని అందరితో కలిసి ఐకమత్యంగా సాధించే గెలుపే అసలైన గెలుపు.

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s