ప్రేమ ఎలాంటి మనిషి లోనైనా చక్కని మార్పు తెస్తుంది!! విలువ: ప్రేమ అంతర్గత విలువ: దయ

13459022-n--n---noe-----n------nsn-n--n--n---n-n--mathematics-vector---n------------nfn--n---n------n-n-----n

అది స్కూలు మొదలైన మొదటిరోజు,ఐదవ తరగతి బయట నిలబడి ఉన్న ఆ తరగతి టీచర్ మిసెస్(Mrs) థాంప్సన్ (Thompson) తన శిష్యులని చూస్తూ అందరూ గురువుల వలే, “నేను మీ అందరిని సమానంగా ప్రేమిస్తున్నాను,మీరంతా నాద్రుష్టిలో సమానమే .ఎవరూ ఎక్కువ,తక్కువ కాదు” అని మనసులో అనుకుంటుంది. అప్పుడు తను ఎదురుకోబోయే పరిస్థితులు తనకి తెలియవు. ఆ తరగతిలో మొదటి వరుసలో టెడ్డీ స్టాలర్డ్(Teddy Stallard) అనే చిన్న బాలుడు కూర్చుని  ఉన్నాడు.

టెడ్డీ మూడవ తరగతి టీచర్ తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఇలా రాశారు “తల్లి మరణాన్ని టెడ్డీ తట్టుకోలేక పోయాడు. అంతేకాక తండ్రి కూడా ఈ పిల్లవాడిని ఇంట్లో సరిగ్గా పట్టించుకోవటం లేదు. ఇది ఇలాసాగితే టెడ్డీ తప్పు దారి పట్టటం ఖాయం.”ఇంక టెడ్డీ నాల్గవ తరగతి టీచర్ ” టెడ్డీ ఎవరితోనూ సరిగా కలవలేకపోతు న్నాడు . బడికి రావటం, చదవుకోవటం పట్ల సరియైన శ్రద్ధ చూపలేక పోతున్నాడు. పైగా అప్పుడప్పుడు పాఠం మధ్యలో పడుకుండిపోతున్నాడు. ” అని రాసింది. ఇవన్నీ చదివిన టెడ్డీ అయిదవ తరగతి టీచర్ “అయ్యో నేను టెడ్డీ ని తప్పుగా అర్ధం చేసుకున్నానే. అతను ఎందుకిలా ఉంటున్నాడో నాకిప్పుడిప్పుడే అర్థమౌతున్నది అని బాధపడింది

ఇంతలో క్రిస్ట్మస్ పండుగ వచ్చింది. తరగతిలోని పిల్లలందరూ మంచి మంచి ఖరీదైన బహుమతులు చక్కగా అందంగా రంగురంగుల కాగితములతో పాక్ చేసి తీసుకొచ్చారు. వాటిలో చిరిగిపోయిన కాగితంతో పాక్ చేసి ఉన్న బహుమతిని టీచర్ తెరిచి చూసింది.  అది టెడ్డీ తెచ్చిన బహుమతి. మిసెస్(Mrs) థాంప్సన్ చాలా ఓపికగా ప్రేమతో అతని బహుమతి తెరిచింది,చూస్తే అందులో తనకి ఒక బ్రేస్లెట్ట్ కనిపించింది. దానిలో కొన్ని రాళ్ళు  కనపడలేదు. బ్రేస్లెట్ట్ తో పాటు పాకెట్ట్ లో ఒక వంతు పెర్ఫ్యూం ఉన్న సీసా ఒకటి కనబడుతుంది. ఇంతటి దయనీయ స్థితి లో ఉన్న బహుమతి చూసి తోటి పిల్లలంతా అపహాస్యం                చేస్తా రు.మిసెస్(Mrs) థాంప్సన్  టెడ్డీ ని  హేళన  చేస్తున్న పిల్లలని మందలించి ” టెడ్డీ, బ్రేస్లెట్ట్ చాలా  బాగుంది అంటూ ఆ పెర్ఫ్యూం ని కొంచెం తన చేతిపై చల్లుకున్నది”

ఆ రోజు స్కూలు అయిపోగానే టెడ్డీ మిస్సెస్స్  థాంప్సన్ దగ్గరికి వచ్చి “టీచర్ ఇవాళ్ళ మీరు మా అమ్మ పెర్ఫ్యూం కొంచెం కొట్టు కోవటం వల్ల మీరు దగ్గరికి వచ్చినప్పుడల్లా నాకు మా అమ్మ గుర్తుకు వచ్చిందండి.” అని తన మనసులో మాట చెప్పి వెళ్ళిపోతాడు. ఇది విన్న మిస్సెస్స్ థాంప్సన్ ఎంతగానో స్పందించి దాదాపు ఒక గంట సేపు కుమిలి కుమిలి ఏడుస్తుంది.

ఈ సంఘటన తరువాత తను టెడ్డీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టటం మొదలు పెట్టింది. తనతో ప్రత్యేకంగా ఎక్కువ సేపు గడిపేది. టెడ్డీ కూడా చాలా హుషారుగా ఉండటం మొదలుపెట్టాడు.

ఇంక ఆపై సంవత్సరం టెడ్డీ ఆరవ తరగతికి వెళ్ళటం మొదలు పెట్టాడు. ఒక రోజు మిస్సెస్స్ థాంప్సన్  ఇంటి బయట ఒక చిన్న ఉత్తరం కనిపించింది అందులో టెడ్డీ, “మిస్సెస్స్ థాంప్సన్ , ఎప్పటికైనా మీరే నాకు అందరికంటే ఎక్కువ ఇష్టమైన టీచర్ అని రాశాడు. ఇలా ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి. మిస్సెస్స్ థాంప్సన్  కి టెడ్డీ నుంచి మరొక లేఖ వచ్చింది. అందులో టెడ్డీ “మిస్సెస్స్ థాంప్సన్ ,  నేను హైస్కూలు ,మంచి మార్కులతో పాస్స్ అయ్యాను అని, తరగతిలో తాను మూడవ స్థానంలో ఉత్తీర్ణుడైనట్లు కూడా రాశాడు.” కానీ, ఇప్పటికి కూడా మీరే  నా ‘బెస్ట్ టీచర్ అని రాశాడు.

సరిగ్గా ఇంకో నాలుగు సంవత్సరాలకి, పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ తన పట్టుదలతో కాలేజీ పూర్తిచేశానని , ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యానని,టెడ్డీ ఇంకో లేఖ రాస్తాడు. ఇప్పటికి కూడా ఆవిడే తన అభిమాన ఉపాధ్యాయురాలని, ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా ఇంతే అని మాట ఇస్తున్నానని రాస్తాడు. ఇంకొంత కాలానికి మళ్ళీ టెడ్డీ బాచిలర్ డిగ్రీ పూర్తి చేశానని ,ఇప్పుడు తను టెడ్డీ కాదు ,‘Theodre F Stallar’ అని తన పూర్తి పేరుతో ఆ లేఖలో సంతకం కూడా చేశాడు.

కథ ఇంతటితో ఆగలేదు. అదే సవంత్సరం తను పెళ్ళి చేసుకుంటున్నట్లు టెడ్డీ మరొక లేఖ రాశాడు. అందులో తన తండ్రి రెండు సంవత్సరాల క్రిందట మరణించారని, అంతేకాక “మిస్సెస్స్ థాంప్సన్  పెళ్ళిలో మీరు నా తల్లి స్థానంలో కూర్చుంటారా” అని వినయంగా అర్ధిస్తాడు. దానికి మిస్సెస్స్ థాంప్సన్ సంతొషంగా అంగీకరించారు. పైగా పెళ్ళికి మిస్సెస్స్ థాంప్సన్  టెడ్డీ తనకు బహుమతిగా ఇచ్చిన తన తల్లి బ్రేస్లెట్ట్ ని తొడుక్కుని ,ఆవిడ వాడే పెర్ఫ్యూం ని కూడా కొంచం జల్లుకుని వస్తారు. టెడ్డీ  తల్లి ,తనతో జరుపుకున్న చివరి క్రిస్ట్మస్ పండుగలో అదే పెర్ఫ్యూం ని వాడారు.మిస్సెస్స్ థాంప్సన్ ని చూడగానే టెడ్డీ ఎంతో ప్రేమగా ఆవిడని కౌగలించుకుని చిన్నగా ఆవిడ చెవిలో “మిస్సెస్స్ థాంప్సన్  నన్ను ఇంతగా నమ్మిన మీకు నేను ఏ రకంగా క్రుతఘ్నతలు     తెలుపుకోగలను. మీరొక్కరే నాకు అండగా నిలిచి నేను జీవితంలో ఏదో సాధిస్తాను అని బలంగా నమ్మారు. నేను నా ప్రతిభ తో ,నా కంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకోగలనని , మీరొక్కరే గుర్తించారు.

ఎంతో ప్రేమ, గౌరవం నిండియున్న టెడ్డీ మాటలు విని మిస్సెస్స్ థాంప్సన్  కళ్ళు చమ్మగిల్లాయి.”టెడ్డీ నేవే నాకు జీవితంలో చక్కటి పాఠం నేర్పావు, నీ వల్లే నేను ఒక ఆదర్శ గురువుగా, పిల్లల జీవితాలని ఎలా తీర్చిదిద్దగలనో నేర్చుకున్నాను. నేవు పరిచయమయ్యేదాకా ,ఒక గురువు ఎలా పిల్లలకు ప్రేమగా పాఠాలు చెప్పవచ్చు, దాని వల్ల పిల్లలు ఎంత స్పూర్తి పొందగలరు అని నాకు అసలు తెలియలేదు.”అని టెడ్డీతో తను ఎప్పటినించో చెప్పాలి అనుకున్న మాటలని మనసు విప్పి చెప్పుకుంటారు ఆవిడ!

నీతి: గట్టి పట్టుదలతో మనం ఒకరి జీవితంలో ఎంత చక్కటి మార్పు తేగలమో ఊహించలేము. ఎంతటి వృక్షమైనా చిన్న విత్తనం నించే కదా వస్తుంది! మంచిని, మానవత్వాన్ని ఎప్పుడూ నమ్మాలి.చక్కటి ఉన్నతమైన భావాలు కలిగిఉండాలి. మనం పరులకి చేసే సహాయం చిన్నదే అయినా పవిత్ర భావాలతో చేస్తే అది వారికి వెయ్యి రెట్లు మేలు కలిగిస్తుంది.

ఏపని కూడా తక్కువ కాదు. ఏది చేసినా మనస్పూర్తిగా, శ్రద్ధతో ,ప్రేమతో మన సాయ శక్తులా చక్కగా చేయాలి. అప్పుడు ఆపని మనకి,  ఎవరి కోసమైతే వారికి చక్కటి ఫలితాలని అందిస్తుంది.

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s