నిజానికి ఆనందం మనలోనే ఉంది!! విలువ: ధర్మము,అంతర్గత విలువ: సరి అయిన వైఖరి.

downloadఒకానొక సాధువు చిన్న ఊరికి వెళతాడు. అతనిని చూడగానే ఆ ఊరి వారు సాధువు చుట్టూ చేరి ఈ విధంగా తమ తమ కోరికలను మనవి చేసుకుంటారు. “స్వామి దయచేసి మమ్మల్ని ఈ కష్టాలనుండి బైటకి లాగి మా కోరికలను నెరవేర్చండి. అప్పుడే మేము జీవితంలో సంతొషంగా ఉండగలము.” అని ఆ సాధువుకి మనవి చేసుకుంటారు.

సాధువు, ప్రశాంతంగా వారి కోరికలను విని మౌనం వహిస్తాడు. మరునాడు సాధువు తన శక్తితో ఆ ఊరివారికి ఆకాశవాణి వినపడేలా చేస్తాడు. అది ఏమిటంటే “రేపు ఈ ఊరిలో సరిగ్గా మధ్యాన్నం ఒక గొప్ప అద్భుతం జరగ బోతున్నది. మీ మీ సమస్యలని ఒక మూటలో గట్టిగా కట్టి, ఊరి చివర నదీ తీరంలో విసిరి పారేసినట్లు ఊహించుకోండి.” తరువాత అదే సంచీలో ,మీకు కావలిసినంత బంగారం, భోజన పదార్ధాలు, నగలు ఇలా ఏది కావాలంటే అది నింపుకుని తెచ్చుకున్నట్టు ఊహించుకోండి.

ఈవిధంగా చేస్తే మీ కోరికలు తప్పక నెరవేరుతాయి. అని ఆకాశవాణి సూచిస్తుంది. ఇదంతా విన్న ఊరివారు ఆశ్చర్యపోయి, నిజమా! లేక కలా అనుకుని, సరే ఆకాశవాణి చెప్పినట్లే చేద్దాము, అలా ఊహించుకోవటం వలన నష్టమైతే లేదు కదా అనుకుంటార.  అది నిజమే అయితే మన కష్టాలన్నీ గట్టెక్కి, మన కోరికలన్నీ నెరవేరుతాయి. లేదా, అది అబద్దమే అయితే ఏమీ నష్టపోము కదా అనుకుని, ఆకాశవాణి చెప్పింది చెప్పినట్లుగా చేద్దాము అని ఆ ఊరి వారంతా కలిసి నిర్ణయించికుంటారు.

సరిగ్గా మరునాడు మధ్యాన్నం 12 గంటలకి, అందరూ వారి వారి సమస్యలను ఒక మూటలో కట్టి నదీ తీరంలో విసిరి పారేసినట్లు, అదే సంచీలో వారికి ఆనందం కలిగించే బంగారం, నగలు  డబ్బు మొదలైనవి వారి వారి కోరికల ప్రకారం ఇంటికి తెచ్చుకున్నట్లు ఊహించుకుంటారు.అయితే ఊహలో అనుకున్నవన్నీ నిజంగానే నెరవేరి వారికి కావలసిన వస్తువులన్నీ వారి వారి ఇంటికి చేరతాయి.

అయితే ఈ సంబరాలు ఎక్కువ సేపు నిలవవు. ఎందుచేతనంటే అందరూ , పక్కవారితో పోల్చుకుని, ఎవరికి వారు “అరే మన పక్కింటి వారు మనకంటే సంతోషాంగా మనకంటే గొప్పగా ఉన్నారే” అనుకుంటూ వారిని చూసి చిన్నతనంగా భావించుకుని, మెల్లిగా కొంతసేపటికి పక్కింటి వారి గురించే కాకుండా ఎవరికి వారు ఊరివారందరి గురించి ఆరాతీయటం మొదలు పెడతారు. ఈవిధంగా ఊరంతా ఒకటే అసంతృప్తి కల్లోలం వ్యాపిస్తుంది.

“ఒకరేమో అరే నేను చాలా సాధారణమైన గొలుసు అడిగానే, మా పక్కింటి ఆవిడ ఖరీదైన నగ కోరుకున్నదే!” అని ఇంకొకరేమో “అయ్యో! నేను చిన్న ఇల్లు కొరుకున్ననే, మా పక్కింటి వాడు గొప్ప భవనమే కోరుకున్నాడు” నేను కూడా అలాగే గొప్ప గొప్పవి కోరుకోవలసింది అయ్యో ఎంతమంచి అవకాశాన్ని చేతులారా వదులుకున్నానే! ఇలాంటి అదృష్టం మళ్ళీ మళ్ళీ మనకి జీవితంలో చిక్కుతుందా అని ఎవరికి వారు నిరాశతో అసంతృప్తితో కృంగి పోతారు.ఇలా మళ్ళీ ఊరంతా దుఃఖసాగరంలో మునిగిపోతుంది.

నీతి:

మామూలుగా అందరూ కష్టాలు ఉంటే ఆనందంగా జీవించలేము అనుకుంటారు. నిజానికి ఎవరికి సమస్యలు లేవు? ఎప్పటికప్పుడు “కష్టాలు నష్టాలు ఎన్ని ఎదురైనా, ధైర్యంగా, సంతోషంగా వాటిని ఎదుర్కుంటాను” అని మనస్సుకి సర్ది చెప్తూ ఉండాలి. ఇలా అనుకుంటూ ఉండటం చేత మనము ఎప్పుడూ నవ్వుతూ చిరునవ్వులు చిందిస్తూ ఉండగలుగుతాము. అలాగని సమస్యలని దాటేసి తప్పించుకుని తిరగమనికాదు!

అవతార పురుషుడైన కృష్ణ పరమాత్మకే తప్పలేదు కదా పరీక్షలని ఎదురుకోవటం. మేనమామ అయిన కంసుడు ఎన్ని సార్లు తనని చంపేందుకు కుట్ర పన్నలేదు? మాహాభారత యుద్దం లో కూడా కృష్ణుడు రధసారధిగా వ్యవహరించి, అర్జునుడు చివరి క్షణంలో,” నేను యుద్ధం చేయను”, అని కురుక్షేత్రంలో తన కవచాన్ని సహితం విసిరి పారేసినప్పుడు, గీతోపదేశం చేసి అర్జునిడికి తన కర్తవ్యం ఏమిటో చక్కగా తెలియపరిచాడు. అర్జునిడిపై శత్రువులు విడిచిన బాణాలని కృష్ణుడు చిరునవ్వుతో ఎదుర్కున్నాడు.

గీతలో ,కష్టాలకి క్రుంగి, సంతొషాలకి పొంగిపోవటం మంచిదికాదని, రెండింటినీ సమానంగా తీసుకోవాలని స్పష్టంగా బోధించాడు కృష్ణుడు. సుఖదుఃఖాలు ఒక నాణానికి రెండు వైపులవంటివి. రెండిటిలోనూ నేర్చుకోవలసినవి చాలా విషయాలు ఉంటాయి. అనుభవపూర్వకంగా ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, మనకి గీతలో శ్రీ కృష్ణుడు తెలిపిన సందేశం స్పష్టంగా అర్ధమవుతుంది.

ప్రపంచంలో లభ్యమయ్యే వస్తువుల వల్లనో, మనుషుల వల్లనో మనము ఆనందాన్ని పొందలేము.ఆనందమనేది మనిషి సహజ స్వభావం. దాని కొరకు మనం బైట ఎక్కడో వెతుక్కునే అవసరం ఏమాత్రం లేదు. అది మనలోనే ఉంది.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s