భగవంతుడు భావప్రియుడు బాహ్యప్రియుడు కాదు! విలువ: ప్రేమ, అంతర్గత విలువ: దయ

angels1

అబ్దుల్లా అనే వ్యక్తి మసీదులో ఒక మూల పడుకుని ఉండగా అతనికి ఇద్దరు దేవదూతల మధ్య జరిగిన సంభాషణ వినపడి హటాత్తుగా మెలకువ వస్తుంది. వారివురూ ధన్య జీవుల యొక్క జాబితా తయారు చేస్తున్నారు. అందులోని ఒక దూత, సికందరు అనే నగరానికి చెందిన మెహబూబ్ అనే వ్యక్తి ,భగవంతుని కృపకు పాత్రులైన వారిలో అందరికంటే ప్రధమ స్థానానికి చెందిన అర్హత కలవాడు అని, అంటుండగా వింటాడు అబ్దుల్లా. అదీకాక మహబూబ్ ఏ తీర్థయాత్రలకు వెళ్ళకుండా ఇంతటి గొప్ప అర్హతను పొందటం అబ్దుల్లాకి ఆశ్చర్యం కలిగించింది. అతడు మహబూబ్ గురించి తెలుసుకోవటానికి సికందరు నగరానికి వెళ్తాడు.

అక్కడికి వెళ్ళాక అబ్దుల్లా, మహబూబ్ ఒక చెప్పులు కుట్టే వాడని తెలుసుకుంటాడు.అంతేకాక అతడు పొట్టకూటికి కూడా సరిపడే డబ్బు లేని నిరుపేద అని కూడా తెలుసుకుంటాడు.

మెహబూబ్ కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి కొంత డబ్బును దాచుకుని ,గర్భవతి అయిన తన భార్యకి ప్రేమతో, పసందైన విందును తయారు చేసి ,ఆమెని ఆనందపరచాలని ఎంతో ఉత్సాహంగా  ఇంటికి బయలుదేరుతాడు. అయితే అతనికిదారిలో ఆకలితో అలమటిస్తున్న ఒక బిచ్చగాడి ఏడుపు వినపడుతుంది. అది విన్న మహబూబ్ ముందుకి వెళ్ళలేక పోతాడు. చివరికి తన భార్య కోసం ఎంతో కష్టపడి ,దాచిన డబ్బుతో తయారు చేసిన , ఆమెకి పసందైన పదార్ధ్హాన్ని ,ఆ బిచ్చగాడికి దగ్గరుండి ప్రెమగా వడ్డించి పెడతాడు . అంతేకాక అతడు తృప్తిగా తింటుండగా చూసి పక్కనే కూర్చుని ఆనందిస్తాడు.

ఈ విధంగా, మెహబూబ్ దయాగుణాన్ని గురించి తెలుసుకున్న అబ్దుల్లా ,అతడు దేవదూతలు తయారుచేస్తున్న జాబితాలో ఉత్తమ స్థానానికి పొందే అర్హత ఎలా దక్కించుకున్నాడో తెలుసుకుంటాడు.

ప్రేమ, దయ వంటి ఉత్తమ గుణములు కలిగి ఉండటం వల్ల ,మెహబూబ్ బోలెడు డబ్బు ఖర్చు పెట్టి మక్కా వంటి పుణ్యస్థలాలకి పుణ్యం కోసం వెళ్ళే ,ఎంతో మందికి దక్కని గొప్ప అదృష్టాన్ని సొంతం చేసుకోగలిగాడు.భగవంతుడు దానం వెనుక ఉన్న పవిత్ర భావాన్ని చుస్తాడే కానీ …ఆర్భాటం కోసం, నలుగురి మెప్పు కోసం చేసే దాన ధర్మాలని ఏ మాత్రం లెక్క చేయడు.

నీతి: సహాయం ఎంత చిన్నదైనా కావచ్చు కాని, అది ప్రేమ, దయ వంటి పవిత్ర భావములతో చేయగలిగితే అది, కించిత్ ప్రేమ కూడా లేకుండా చేసే పెద్ద సహాయం కంటే ఎంతో మేలు!అందుకే అంటారు భగవంతుడు భావప్రియుడు కానీ బాహ్య ప్రియుడు కానేకాదు!

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s