“ప్రేమ పరివర్తన తెస్తుంది” అన్నది గొప్ప సిద్దాంతం! విలువ: ప్రేమ ,అంతర్గత విలువ: పెద్దలను ప్రేమించటం, గౌరవించటం.

hqdefault

చాలా కాలం క్రిందట లీ-లీ అనే ఒక అమ్మాయి పెళ్ళి చేసుకుని భర్తతో కలసి, అత్తవారింటికి కాపురానికి వెళ్ళింది. కొద్దిరోజులకే ఆమె తనకి, అత్తగారికి సరిపడదని భావించింది. వారిద్దరి వ్యక్తిత్వాలు పూర్తిగా వ్యతిరేకమైనవి. అత్తగారి అలవాట్లు, పద్ధతులు అంటే ఈ అమ్మాయికి చాలా కోపంగా ఉండేది. అంతే కాకుండా అత్తగారు ,లీ-లీ ని ఎప్పుడూ విమర్శిస్తూ ఉండేది. అలాగే రోజులు, వారాలు గడిచిపోతున్నాయి. లీ-లీ, ఆమె అత్తగారు నిరంతరం ఏదో ఒక విధంగా వాదించుకుంటూ, పోట్లాడుకుంటూ ఉండేవారు. ప్రాచీన చైనా వారి సంప్రదాయం ప్రకారం కోడలు అత్తగారి ముందు తలవంచుకుని, ఆవిడ ప్రతి కోరిక తప్పకుండా తీర్చవలసిరావటం, వీళ్ళ పరిస్తితిని మరింతగా దిగజార్చి వేసింది. ఇంట్లోని ఈ కోపతాపాలు, అశాంతి పాపం నిస్సహాయుడైన భర్తకి చాలా విచారమును కలిగిస్తూ ఉండేది.

అత్తగారి చెడ్డ స్వభావం, నియంతృత్వ ధోరణి ఇంక ఎంత మాత్రమూ భరించలేక పోయిన లీ-లీ ఏదైనా ఒక పరిష్కారం ఆలోచించాలని నిర్ణయించుకున్నది. తన తండ్రికి మంచి స్నేహితుడైన మిష్టర్ హువాంగ్ దగ్గరికి లీ-లీ వెళ్ళింది. అతను మూలికలు అమ్ముతుంటాడు. ఆమె అతనితో పరిస్థితిని గురించి వివరంగా చెప్పి, అతను కొంచం విషం ఇస్తే తన సమస్యని పూర్తిగా అంతం చేసుకోగలుగుతానని అన్నది. మిష్టర్ హువాంగ్ ఒక్క నిమిషం ఆలోచించాడు.

“లీ-లీ, నీ సమస్య పరిష్కారం కావటానికి నేను తప్పకుండా సహాయం చేస్తాను. కానీ, నువ్వు నేను చెప్పినట్లు నడుచుకోవాలి” అన్నాడు హువాంగ్. లీ-లీ “తప్పకుండా మిష్టర్ హువాంగ్! మీరు చెప్పినట్లే చేస్తాను” అన్నది. మిష్టర్ హువాంగ్ వెనుక గదిలోనికి వెళ్ళి కొద్ది నిమిషాలలో కొన్ని మూలికలు తీసుకుని వచ్చాడు. అతడు లీ-లీ తో “మీ అత్తగారు తొందరగా పోవటానికి వెంటనే పనిచేసే విషం నేను ఇవ్వటం లేదు. ఎందుకంటే అలా చేస్తే జనానికి సందేహం కలుగుతుంది నీమీద. అందువల్ల నీకు కొన్ని రకరకాల మూలికలు ఇస్తున్నాను.ఇవి నిదానంగా ఆమె శరీరం పై విష ప్రభావాన్ని కలిగిస్తాయి. రోజు విడిచి రోజు నీవు వండే వంటకాలలో ఈ మూలికలను కలిపి ఆమెకు తినిపించు. ఆమె చనిపోయినా, నీమీద ఎవ్వరికీ సందేహం కలగకుండా ఉండేటందుకు ఆమెతో చాలా స్నేహంగా ప్రవర్తించు. ఇకమీదట వాదించకుండా, మీ అత్తగారి ప్రతి కోరికను తీర్చు, ఆమెను ఒక మహారాణీ లాగా చూసుకో” అని చెప్పాడు.

లీ-లీ ఎంతో సంతోషించి, మిష్టర్ హువాంగ్ కి కృతజ్ఞతలను తెలియచేసి, అత్తగారిని చంపాలన్న పధకం అమలు చేయాలన్న ఉద్దేశంతో ఇంటికి తిరిగి వచ్చింది. లీ-లీ తాను వండిన వంటకాలలో ఆ మూలికలను కలిపి అత్తగారికి పెట్టసాగింది. అలా రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి.మిష్టర్ హువాంగ్ చెప్పిన సలహా ప్రకారం జనాలకి తనపైన అనుమానం రాకుండా అత్తగారితో స్నేహంగా ఉంటూ, వాదించ కుండా ప్రేమతో, ఆమెను తన స్వంత తల్లిలాగా చూసుకోసాగింది. ఆవిధంగా ఆరు నెలలు గడిచేసరికి ఇంటి వాతావరణం అంతా మారిపోయింది. లీ-లీ తన స్వభావాన్ని ఎంతగా అదుపు చేసుకున్నదంటే ఇప్పుడు ఆమెకు అసలు కోపం లేదు. అత్తగారితో అసలు వాదించటమే లేదు.ఇప్పుడు, ఆమె అత్తగారు కూడా ఎంతో సౌమ్యంగా మారిపోయింది. కోడలి పట్ల అత్తగారి ప్రవర్తన కూడా మారి పోయింది. ఆమె కోడలిని తన స్వంత కూతురిలా ప్రేమించసాగింది. అత్తగారు తన స్నేహితులు, బంధువులతో తన కోడలు లీ-లీ చాలా ఉత్తమురాలని, అటువంటి కోడలు దొరకటం తన అదృష్టమని చెప్పసాగింది. ఇప్పుడు లీ-లీ, ఆమె అత్తగారు, తల్లీ కూతుళ్ళలాగా ఎంతో ప్రేమతో ఉండటం వలన, భర్త కూడా ఎంతో ఆనందంగా ఉంటున్నాడు.

295f99c6065da9ae683b4241a7a2d166

ఒక రోజున లీ-లీ మళ్ళీ మిష్టర్ హువాంగ్ దగ్గరికి వెళ్ళింది సహాయం కోరుతూ.”మిష్టర్ హువాంగ్! మా అత్తగారు నేను పెట్టిన విషం వలన చనిపోకుండా మళ్ళీ మీరే ,ఏదైనా మూలికలు ఇవ్వండి. ఆమె ఇప్పుడు ఎంతో మారిపోయి నన్ను స్వంత తల్లిలాగా ప్రేమిస్తున్నది. నేను పెడుతున్న విషం వలన ఆమె చనిపోవటం నాకు ఇష్టం లేదు.” అని చెప్పింది. మిష్టర్ హువాంగ్ నవ్వుతూ తల ఊపాడు.”లీ-లీ, విచారించవలసినది ఏమీ లేదు. నేను అసలు నీకు విషమే ఇవ్వలేదు. నీకు నేను ఇచ్చిన మూలికలు, మీ అత్తగారి ఆరోగ్యం మెరుగు పడటం కోసం ఇచ్చిన విటమిన్లు. విషం ఉన్నది నీ మనసులో, ఆవిడ పట్ల నీ స్వభావంలో. కాని, ఇప్పుడు నీవు ఆవిడ పట్ల చూపిస్తున్న ప్రేమ వలన ఆ “విషం” అంతా కొట్టుకు పోయింది.” అని మిష్టర్ హువాంగ్ అన్నాడు.

 

నీతి: స్నేహితులారా, ఇతరులు మీ పట్ల ఎలా ప్రవర్తిస్తారో, మీరు కూడా వారి పట్ల అలాగే ప్రవర్తిస్తారన్న విషయాన్ని మీరు ఎప్పుడైనా గుర్తించారా?  “ఇతరులను ప్రేమించేవాళ్ళు ఇతరులచేత తాము కూడా ప్రేమింపబడతారని” చైనా లో అంటారు. ఇది చాలా విలువైన బంగారం లాంటి మాట.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s