విన్నపము

పిల్లలలో సత్ప్రవర్తనను మానవతావిలువలను పెంపొందింప  చేయదాన్కిక్ ఈ బ్లాగ్ అంకితం చేయబడుతోంది. వివిధ కథలు అనుభవాల ద్వారా పిల్లలలో విలువలను పెంపొందింప చేయడం వాటిని అనుసరింపచేయడం మా లక్ష్యం. మా స్వామి మార్గ దర్శకులు  ఐన శ్రీ శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారికి మరియు ఆదర్శ బాలవికాస గురువు మా అమ్మగారు శ్రీమతి

ఆనందీ పరమేశ్వరన్ గారికి కానుకగా ఈ బ్లాగ్ ను   సమర్పించు చున్నాను . స్వామి ఆశీస్సు ల వలన విద్య-మానవతా విలువలు అను కార్యక్రమములో సుమారు 10 సంవత్సరములు పైగా పాలు పంచు కొనుట వలన పిల్లల మనస్సులలో మానవతా విలువలను పెంపొందించు టకై కృషి చేయు ఈ కార్య క్రమము లో పాల్గొనుటకు నాకు ఈ చిన్న  అవకాశము లభించినది .

మొక్కను వంచడం సాధ్యమౌతుంది  కాని చెట్టును వంచండం సాధ్యం కాదని స్వామి చెప్పినట్లుగా చిన్నతనం నుంచీ పిల్లలను సక్రమమైన మార్గం లో తీర్చి దిద్ది వాళ్ళలో ఉన్నతమైన విలువలను పెంపొందింప చేయడం మన కర్తవ్యం స్వామి ఉద్దేశ్యం లో విద్య యొక్క లక్ష్యం సత్ప్రవర్తనను అలవరచుకోవడం సక్రమమైన నడవడిక లేనివాని జీవితం దీపం లేని ఇల్లు లాంటిది. విలువలను ప్రబోధించే కథల ద్వారా ధ్యానం లేదా ప్రార్థన ల ద్వారా ఈ లక్ష్యాన్ని సాదిం చాలని మేము భావిస్తున్నాము

మానవతా విలువలను అనుసరించడం పిల్లలలో వాటిని పెం పొందిం పచేయడం లక్ష్యం గా కలవారెవరైనా జాతి కుల మత భేదాలతో నిమిత్తం లేకుండా ఈ  బ్లాగ్ ను ఉపయోగించుకోవచ్చు ఏ మతాన్ని దేవుడిని దేవతని గురువును గురించి ప్రచాచం చేయడానికి ఈ బ్లాగ్ ఉద్దేసించ బడలేదు విలువలు విశ్వజనీన మైనవి.  కథలని ఎక్కడ నుంచి సేకరించినా రచయితలకు లేదా సంబంధించిన వారికి కృతజ్ఞత కలిగి ఉంటాము మానవతా విలువలు శీఘ్రంగా  అంతరించి పోతున్న ఈ రోజులలో మేము చేసే ఈ కృషి తరువాత తరాలవారికి ఉపయోగ పద గలదని ఆశిస్తున్నాను

తెలుగులో ఈ కథలను అనువదించే బాధ్యతను స్వీకరించిన తెలుగు టీం సభ్యులు శ్రీమతి లక్ష్మి నాగి, మరియు శ్రీమతి విశాలకిరణ్ గార్లకు ప్రత్యేకముగా ధన్యవాదములు తెలుపుచున్నాను. వాళ్ళ సహకారం వెల  కట్టలేనిదని నిస్సందేహం గా చెప్ప  గలను .ఆంద్ర ప్రదేశ్ లోని విద్యార్ధు లోతో పాటు ప్రపంచంలో తెలుగు మాటలాడే వారికి అందరికీ ఈ సమాచారం చేరగలదని ఉపయోగపడగలదని ఆశించు చున్నాను .

విద్య ఉన్నతం గా జీవించడానికి ఉపయోగ పడాలి తప్ప కేవలం

బ్రతకడానికి మాత్రం కాదు అనే స్ఫూర్తి తో యథా శ క్తి ఈ కృషికి పూను కున్నాము .

శ్రీ సత్య సాయి కి కోటి ప్రణామాలు.

నాకు చిన్నప్పటి నుంచి స్వామి అంటే చాలాఇష్టం. నేను అమ్మవారిని కొలుచుకోవడం  మొదలుపెట్టాక , స్వామి లో అమ్మవారి చూసుకున్నాను. స్వామిని నేను సాయి మా అని పిలుస్తాను.

స్వామి బాల్ వికాస్ గురించి నాకు అంతగా అవగాహనా లేదు. అందుకే మా పిల్లనిని కూడా, పంపించలేక పోయాను. కాని ఈబాల్ వికాస్ లో పిల్లలు ఎన్నో విలువలు  నేర్చుకోవచ్చు. అందరి పిల్లలకి ఈ అవకా శం రావాలని , ఈ స్వామి కార్యం లో పాల్గొనడానికి ప్రయత్నిస్తాను.— శ్రీమతి లక్ష్మి నాగి

నేను చిన్నతనము నుంచి స్వామి భక్తురాలిని, స్వామిని నా మిత్రునిగా  భావిస్తున్నాను. స్వామికి నా కృతజ్ఞత తెలుపు కొ నుటకై, స్వామి భక్తులకు సేవ చేయుటకై  మరియు పిల్లలకు మానవతావిలువలు వారి మాతృభాష లొ అందించే ప్రయత్నం   చేస్తున్నాను.

మా నాన్న గారు శ్రీ డి. వి. జి .ఎ . సోమయాజులు గారి సహకారముతో ఈ  బ్లాగు నిర్వహణ లో పాల్గోనుచున్నాను— శ్రీమతి విశాలకిరణ్

ఇట్లు

నందినీ రమేష్

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s