పద్మపాద -గురు భక్తి

padmapada

విలువ — విశ్వాసము
అంతర్గత విలువ — భక్తి

జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య గారికి నలుగురు శిష్యులు.
1. హస్తమాలక 2. తోటకాచార్య 3. సురేశ్వర 4. పద్మపాదా.
పద్మపాదా అసలు పేరు సనందన.

పద్మపాద అసలు పేరు ‘సనందన’. శంకరాచార్యులు, వారు కాశి లో ఉన్నప్పుడు, ఈ ప్రపంచానికి సనందనకి ఉన్న గురుభక్తిని, నిరూపించే ప్రయత్నం ఈ విధంగా చేశారు.

గంగా నదికి ఒక వైపు సనందన గురువుగారి బట్టలను ఉతికి అరేస్తున్నాడు. సరిగ్గా నదికి అవతలి వైపు,అప్పుడే స్నానం
చేసి తడి బట్టలతో బైటికి వచ్చిన గురువుగారు, సనందుడిని కట్టుకోవటానికి పొడి బట్టలు తెమ్మని పిలిచారు.

గురువు పట్ల అమితమైన భక్తి,విశ్వాసములున్న సనందనుడు ‘గురువుగారు ఏమైనా చెప్తే వెంటనే చెయ్యాలి ‘ అని నిర్ణయించుకున్నాడు. గరువుగారిని తడి వస్త్రములతో చూడలేకపోయాడు.
సనందనుడికి ఒక్కటే ఆలోచన! అది ఏమిటి అంటే గురువువుగారికి పొడి వస్త్రములు అందించడం. అంతే !
అతడు నది ప్రవాహాన్ని లెక్కచేయలేదు.కనీసం నదిని దాటి వెళ్ళాలి అంటే పడవలో వెళ్ళాలి అని కూడా అతనికి తట్టలేదు.

నేలమీద నడిచినట్టు , గంగా నదిలో నడుచుకుంటూ , ముందుకి సాగాడు సనందన. నదిలో మునిగిపోతాననే భయం కానీ, తన చేతిలోని పొడి బట్టలు ఆ నీటిలో పది మళ్ళీ తడిసిపోతాయేమో అనే ఆలోచన కూడా లేదు సనందుడికి.
అంతటి అచంచల భక్తి ఉన్న భక్తుడిని ఆపద నుండి ఆ భగవంతుడు ఆడుకోడా చెప్పండి.
సరిగా ఇక్కడ అదే ఆదిభితం జరిగింది.

గంగాదేవి సనందుడు అడుగుపడే ప్రతి చోట తామరపువ్వులను పరిచి దోవచేసింది.
సనందనకి,తానూ పువ్వులు మీద నడుస్తున్నట్టు కూడా తెలియలేదు.

చుట్టూ ఉన్నవాళ్లు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. కానీ సనందన సునాయాసంగా నదిని దాటి, గురువుగారి దెగ్గిరకి పొడి వస్త్రములను అందించటానికి వచ్చేసాడు సనందనుడు.

అప్పుడు శంకరాచార్యులు సనందుడిని ‘అవతల ఉన్న నువ్వు ఇంత తొందరగా నదిని ఎలా దాటగలిగావు’? అని ప్రశ్నించారు
దానికి జవాబుగా సనందన ఇలా అన్నాడు ‘గురువుగారు!, మిమ్మల్ని తలుచు కుంటే, ఈ సంసారం అనే సముద్రంలో నీరు, మోకాళ్ళ లోతుకి వెళ్ళిపోతుంది.”మీ ఆజ్ఞను శిరసావహించడం ముఖ్యం. దాని ముందు ఏ కష్టమైన చిన్నదే . మీ అనుగ్రహంతో వాటిని దాటగలము.” అని అన్నాడు.
అప్పటికి కూడా సనందుడికి తాను నదిని నడుచుకుంటూ దాటి వచ్చాడనే స్పృహ లేదు .అప్పుడు గురువుగారు సనందుడికి తామరపూలని చూపిస్తూ… నీవు అడుగు వేసిన ప్రతి చోట ఓ పద్మము వికాసంచింది కనుక ,నీవు ఇకముందు “పద్మపాదా”అనే పేరుతో పిలవబడతావు అని ఆశీర్వదించారు.

నీతి:
ఎవరికైతే గురువు పట్ల అచంచలమైన భక్తి, ప్రేమ, విశ్వాసములు ఉంటాయో, వారిని గురువు ఎప్పుడు, కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారికి ఏ లోటూ రాకుండా చూసుకుంటారు.

 

https://saibalsanskaar.wordpress.com/2015/07/31/padmapada-guru-bhakti/